పాకిస్థాన్ కు హడల్.. భారత నౌకా దళంలోకి మరో బ్రహ్మాస్త్రం
సరిహద్దు దేశాలతో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో భారత అమ్ముల పొదిలోకి మరో బ్రహ్మాస్త్రం చేరింది. INS ఆండ్రోత్ జాతికి అంకితం అయింది. యాంటీ- సబ్ మెరైన్ వార్ ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్(ASW-SWC) విభాగంలో ఇది రెండో జలాంతర్గామి. విశాఖపట్నంలోని నేవల్ డాక్ యార్డ్ లో నిర్వహించిన కార్యక్రమంలో జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైస్ అడ్మిరల్ రాజేశ్ పెండార్కర్, ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, ఈస్ట్రర్న్ నేవల్ కమాండ్ అధికారులు పాల్గొన్నారు.
భారత నౌకాదళం మరో మైలురాయిని చేరుకుంది. INS ఆండ్రోత్ ను జాతికి అంకితం చేశారు వైస్ అడ్మిరల్ రాజేశ్ పెండార్కర్. ఈ జలాంతర్గామిలో దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతిక వ్యవస్థలను అమర్చారు. INS ఆండ్రోత్ భారత నౌకాదళంలోకి రావడంతో నౌకాదళ శక్తి, ఆత్మ నిర్భర భారత్ లో ముందడుగు వేసింది. INS ఆండ్రోత్ ను తీరప్రాంత భద్రత, సెన్సార్స్ తో గస్తీ నిర్వహించేందుకు రూపొందించారు.
INS ఆండ్రోత్ పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అత్యాధునిక యాంటీ- సబ్ మెరీన్ వార్ ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ (ASW-SWC) విభాగంలో రూపొందించారు. కోల్ కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ (GRSE) సంస్థ ఈ జలాంతర్గామిని నిర్మించింది. ఈ యుద్ధనౌకను 80 శాతానికి పైగా స్వదేశీ టెక్నాలజీతో నిర్మించారు. ఈ నౌక 77 మీటర్ల పొడవు, సుమారు 1500 టన్నుల బరువు కలిగి ఉంది. ప్రత్యేకంగా రూపొందించిన అత్యాధునిక సెన్సార్లు, ఆయుధాలు, ప్రొపల్షన్ సిస్టమ్స్ ఈ జలాంతర్గామి సొంతం. అలాగే ఈ జలాంతర్గామిలో సోనార్ కమ్యూనికేషన్ వ్యవస్థ, సాగరిక క్షిపణులు సహా, రేడియేషన్ బయటకు రాకుండా భద్రతా ఏర్పాట్లు కూడా ఉన్నాయి.

కోల్ కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్‌ఎస్‌ఈ) నౌకా నిర్మాణ సంస్థ ఈ జలాంతర్గామిని రూపొందించింది. ఈ శ్రేణిలో ఇది రెండో యుద్ధనౌక.. మొదటిది ఐఎన్‌ఎస్ అర్నాలా. అది జూన్ 18న లాంఛనంగా భారత నౌకాదళంలో చేరింది. లక్ష దీవుల్లోని అండ్రోత్ అనే ఐలాండ్ పేరును రెండో యుద్ధనౌకకు పెట్టారు. ఈ యుద్ధ నౌకలో దేశీయంగా తయారుచేసిన 30 ఎంఎం సర్ఫేస్ గన్ కూడా ఉంది. మొత్తం 16 జలాంతర్గాములను నేవీ ఆర్డర్ పెట్టింది. ఇందులో 8 నౌకలను జీఆర్ఎస్ఈ ఉత్పత్తి చేస్తోంది.
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications