మళ్లీ ఎఫ్‌బీ, ఇన్ స్టా డౌన్.. యూజర్ల ఆగ్రహాం.. ట్విట్టర్‌కి వెళతామంటూ వార్నింగ్

సోషల్ మీడియా.. స్తంభిస్తే.. యువత ఆగం ఆగం అవుతున్నారు. ఒక యూతే కాదు.. అందరికీ ఫేస్‌బుక్, ఇన్ స్టా.. నిత్యవసరాలు అయిపోయాయి. ఉదయం లేచిన సమయం నుంచి పడుకునే వరకు ఫోన్ పట్టుకుని ఉండాల్సిందే. ఈ మధ్య ఎఫ్‌బీ, ఇన్ స్టా డౌన్ అవుతున్నాయి. దీంతో జనం అసహనికి గురవుతున్నారు. ఆ సైట్లపై తమకు తోచినట్టు కామెంట్లు చేస్తున్నారు.

ఇతర దేశాల్లో కూడా

ఇతర దేశాల్లో కూడా

ఫేస్ బుక్, ఇన్ స్టా మరోసారి స్తంభించిపోయింది. భారతే కాదు ఇతర దేశాల్లో సర్వీసులు నిన్న అర్ధరాత్రి నుంచి పనిచేయడం ఆగిపోయాయి. దీంతో నెటిజన్లు ఆగ్రహానికి గురయ్యారు. ఫేస్‌బుక్‌కు చెందిన సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ను వదిలేసి ట్విట్టర్‌ను వినియోగిస్తామని ట్వీట్‌ చేస్తున్నారు. రకరకాల మీమ్స్‌ వేస్తున్నారు.
'డౌన్ డిటెక్టర్' రిపోర్ట్‌ ప్రకారం.. బుధవారం అర్ధరాత్రి 12:01 నిమిషాల సమయంలో ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగ్రామ్‌, వాట్సాప్‌,ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ సర్వీసులు కొన్ని గంటల పాటు ఆగినట్లు తెలిపింది. భారత్‌తోపాటు యూఎస్‌, యూకే దేశాలకు చెందిన యూజర్లు ఫేస్‌బుక్‌కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది.

హ్యాష్‌టాగ్

హ్యాష్‌టాగ్

ఫేస్‌బుక్‌తో పాటు ఇన్‌స్ట్రాగ్రామ్‌ సర్వీసులు ఆగిపోవడంపై #facebookdown, #instagramdown అనే హ్యాష్‌ ట్యాగ్‌ నెట్టింట్లో ట్రెండ్‌ అవుతున్నాయి. దీనిపై "ఫేస్‌బుక్‌ ఈఎంఈఏ కమ్యూనికేషన్‌ మేనేజర్‌ అలెగ్జాండ్రూ వాయిస్కా స్పందించారు. మెసేజింగ్‌ యాప్స్‌ పనిచేయడం లేదని ఫిర్యాదులు అందాయి. బగ్‌ను గుర్తించి త్వరలోనే సేవల్ని అందుబాటులోకి తెస్తామని అన్నారు. మెసేజింగ్‌ సర్వీస్ నిలిచిపోయినందుకు క్షమించాలని ఇన్‌స్ట్రాగ్రామ్‌ అఫిషియల్‌ అకౌంట్‌ నుంచి బుధవారం అర్ధరాత్రి 1.33 గంటలకు మెసేజ్‌ చేశారు. ఆ తరువాత మరోసారి తెల్లవారు జామున 4.34 గంటల ప్రాంతంలో వీఆర్‌ బ్యాక్‌ బగ్‌ను గుర్తించి, సమస్యను పరిష్కరించామని మెసేజ్‌ చేశారు. కానీ అంతలోపు యూజర్లు తెగ హడావిడి చేశారు.

ఇదీ మూడోసారి

ఇదీ మూడోసారి

అక్టోబర్‌ నెలలో వరుసగా రెండు సార్లు, బుధవారం అర్ధరాత్రి ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు నిలిచిపోవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తమదైన స్టైల్లో ఫేస్‌బుక్‌ తీరును విమర్శిస్తున్నారు. మేం ట్విట్టర్ యూజ్ చేస్తామని బెదిరించారు. రకరకాల మిమ్స్ చేశారు. అవీ కూడా తెగ వైరల్ అవుతున్నాయి. ఒక్కొక్కరు ఒకలా మిమ్స్ షేర్ చేశారు. ఎఫ్‌బీ, ఇన్ స్టా.. మాతృసంస్థగా మెట మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా మరొసారి సాంకేతిక సమస్య వచ్చింది. గురువారం తెల్లవారుజామున ఇష్యూ సాల్వ్ అయిన.. నెటిజన్లు మాత్రం దుమ్మెత్తిపోశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+