శుభవార్త: ఇంటెల్ లో టెక్కీలకు 3 వేల ఉద్యోగాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగుళూరు: చిప్ తయారీలో పేరొందిన ఇంటెల్ సంస్థ భారత్ లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. బెంగుళూరులో కొత్తగా ఏర్పాటుచేస్తున్న రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ లో రూ.1,100 కోట్లను పెట్టుబడులుగా పెట్టనున్నట్టు బుదవారం నాడు అధికారికంగా ప్రకటించింది. దీంతో మూడువేల కొత్త ఉద్యోగాలు రానున్నాయి.

ఈ సెంటర్ ద్వారా వచ్చే 18 మాసాల్లో కొత్త ఉద్యోగాలను కల్పించనున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. దీనిలో భాగంగా మూడు వేలకు పైగా ఉద్యోగాలను సృష్టించనున్నట్టు ప్రకటించింది. ఎనిమిది ఎకరాల క్యాంపస్ లో ఈ కొత్త ఆర్ అండ్ డీ సెంటర్ ను ఇంటెల్ ఏర్పాటుచేస్తోంది.

Intel's New Bengaluru Centre To Generate 3,000 Jobs

కంప్యూటర్ సాప్ట్ వేర్ డెవలప్ మెంట్ హర్డ్ వేర్ సర్వీస్ సౌకర్యాలను కూడ ఇక్కడే కల్పించనుంది. భారత్ లో తమ వ్యాపారాల విస్తరణలో భాగంగా ఈ పెట్టుబడులను పెట్టనున్నట్టు ఇంటెల్ ఇండియా జనరల్ మేనేజర్ నివృతిరాయ్ చెప్పారు.

ఇంటెల్ 2016 వరకు భారత్ లో పెట్టిన 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు ఈ కొత్త పెట్టుబడులు అదనం. కంపెనీ భారత సబ్సిడరీలో దాదాపు 7వేల మంది టెక్కీలు తన గ్లోబల్ కస్టమర్ల కోసం పనిచేస్తున్నట్టు ఇంటెల్ ప్రకటించింది. రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ హర్డ్ వేర్ డిజైన్, టెస్టింగ్ కంప్యూటర్ల హార్డ్ వేర్ వాలిడేషన్ తర్వాతి తరం డిజిటల్ డివైజ్ లకు సాఫ్ట్ వేర్ ఉత్పత్తులపై కంపెనీ కార్యకలాపాలను కేంద్రీకరించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
World's leading chip maker Intel Corporation is investing Rs. 1,100 crore in India to set up a new Research and Development centre in Bengaluru, said an official on Wednesday.
Please Wait while comments are loading...