తండ్రితో క‌లిసి ఎవ‌రెస్ట్‌ను అధిరోహించిన ఇంట‌ర్ విద్యార్థిని..!

నేటి యువ‌త అనుకుంటే సాధించ‌లేనిది ఏదీ ఉండ‌దు. అలాంటి ఘ‌నతే ఇప్పుడు ఓ ఇంట‌ర్ విద్యార్థిని సాధించింది. ముంబైకి చెందిన 16 ఏళ్ల కామ్యా కార్తికేయన్ అసాధారణ రికార్డును కైవ‌సం చేసుకుంది. కామ్యా త‌న తండ్రితో క‌లిసి ఎవ‌రెస్ట్‌ను అధిరోహించింది. ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తయిన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్ట్ ను నేపాల్ వైపు నుంచి అధిరోహించిన తొలి భారత పిన్నవయస్కురాలిగా కామ్యా రికార్డు సృష్టించింది. అలాగే, వ‌రల్డ్ వైడ్‌గా ఈ ఘనత సాధించిన రెండో అతిపిన్న వయస్కురాలిగా నిలిచింది.

'కామ్యా కార్తికేయ‌న్ అసాధారణ ప్రతిభ క‌న‌బ‌రించింది. ప‌ద‌హారేళ్ల కామ్యా భారత నౌకాదళంలో పనిచేసే తన తండ్రి ఎస్. కార్తికేయన్ తో కలసి మే 20 వ తేదీన 8849 మీటర్ల ఎత్తయిన ఎవరెస్ట్ ను అధిరోహించింది. ఈ విషయాన్ని భారత నౌకాదళానికి చెందిన వెస్టర్న్ నేవల్ కమాండ్ సోష‌ల్‌మీడియాలోని త‌న ఖాతా ద్వారా తెలియ‌జేశాడు. కామ్యా కార్తికేయన్ ప్రస్తుతం ముంబైలో నివ‌సిస్తోంది. కామ్యా నేవీ చిల్డ్రన్ స్కూల్లో 12వ తరగతి చదువుతోంది. ఈ యువ‌తి రాష్ట్రీయ బాల పురస్కారాన్ని కూడా అందుకుంది. ఫిబ్రవరి 2020 లో ప్రధాని మోదీ తన 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమంలో కామ్యా పేరు ప్రస్తావించడం జ‌రిగింది. అలాగే, జనవరి 2021లో కామ్యాతో ప్ర‌ధాని వర్చువల్ గా కూడా మాట్లాడారు.

Inter student who climbed Everest with her father

అదే త‌న‌ముందున్న ల‌క్ష్యం..

ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఉన్న ఎత్తయిన పర్వత శిఖరాల్లో కామ్యా ఇప్ప‌టికే ఆరింటిని అధిరోహించింది. అంటార్కిటికా ఖండంలోని మౌంట్ విన్సన్ మాస్సిఫ్ పర్వత శిఖరాన్ని ఈ డిసెంబర్‌లో అధిరోహించాలని కామ్యా కార్తికేయ‌న్ భావిస్తోంది. ఇదే ప్ర‌స్తుతం త‌న‌ముందున్న ఏకైక ల‌క్ష్యం. ఈ శిఖ‌రాన్ని అధిరోహించ‌డంతో కామ్యా 'ఏడు ఖండాల్లో ఏడు శిఖరాల‌ను అధిరోహించిన అతిపిన్న వయస్కురాలిగా నిలుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+