MS Dhoni : మహేంద్ర సింగ్ ధోనీకి గాయం-చెన్నై సూపర్ కింగ్స్ కు 24 గంటల్లో మూడో షాక్..!

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ను పేలవంగా ఆరంభించిన చెన్నె సూపర్ కింగ్స్ జట్టుకు వరుస షాక్ లు తగులుతున్నాయి. తొలి మ్యాచ్ లో ఓటమి తర్వాత కాస్త నిలకడగా ఆడుతున్నట్లు కనిపించిన చెన్నై జట్టు.. నిన్న రాజస్దాన్ రాయల్స్ తో జరిగిన కీలక పోరులో చేతులెత్తేసింది. మిడిల్ ఓవర్లలో బ్యాట్స్ మెన్ నిలకడలేమితో సునాయాసంగా గెలవాల్సిన ఈ మ్యాచ్ ను కోల్పోయిన చెన్నైకు గత 24 గంటల వ్యవధిలో వరుసగా మూడు ఎదురుదెబ్బలు తగిలాయి.

నిన్న రాజస్తాన్ రాయల్స్ తో మ్యాచ్ లో గాయం కారణంగా కీలక బౌలర్ సిసాండా మగల దూరం కాగా.. ఈ మ్యాచ్ లోనే చివర్లో మెరుపులు మెరిపించిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా గాయపడినట్లు తెలుస్తోంది. అసలే రాజస్తాన్ రాయల్స్ తో మ్యాచ్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఈ ఓటమి ఓ దెబ్బ తాగా.. బౌలర్ సిసాండా, కెప్టెన్ ధోనీల గాయాలు మరో రెండు ఎదురుదెబ్బలుగా మారిపోయాయి.

 msdhoni

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మోకాలి గాయంతో బాధపడుతున్నాడని చెన్నై హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపాడు,దీంతో ధోనీ వికెట్ల మధ్య పరుగులు తీయడం కష్టంగా మారనుందన్నాడు. రాజస్థాన్ రాయల్స్‌ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఛేజింగ్ సమయంలో ధోని పూర్తి లయతో పరుగెత్తలేదని కోచ్ తెలిపాడు. ఇది ఐపీఎల్ కు ముందు సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ గేమ్ సమయంలో కూడా జరిగిందన్నాడు. చెన్నైలో సూపర్ కింగ్స్ ప్రీ-సీజన్ క్యాంప్ సమయంలో, ధోనీ తరచుగా మోకాలి క్యాప్ ధరించి కనిపించాడు.

ఇప్పటికే గాయాల కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఈ సీజన్ లో గాయాల కారణంగా పేసర్ దీపక్ చాహర్, ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్, బ్యాటర్ సిమర్జీత్ సింగ్ దూరం కాగా.. ఇప్పుడు సిసాండా, ధోనీ గాయపడ్డారు. వీరిద్దరి తాజా పరిస్ధితిని అంచనా వేస్తున్నట్లు టీమ్ మేనేజ్ మెంట్ చెబుతోంది. అయితే సిసాండా గాయంతో టోర్నీలో మిగతా మ్యాచ్ లకు దూరమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ధోనీ గాయాన్ని అంచనా వేశాక వివరాలు వెల్లడించేందుకు చెన్నై జట్టు సిద్ధమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+