IPL 2023 : ఐపీఎల్ 2023లో టాప్ 5 చెత్త బ్యాట్స్ మెన్ వీరే.. డబ్బులు దండగ..

ఐపీఎల్ 2023 సీజన్ ప్లే ఆఫ్ దశకు చేరుకుంటోంది. ఈ నెల 21 తర్వాత ప్లే ఆఫ్ మ్యాచ్ లు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఐపీఎల్ లో పలువు బ్యాట్స్ మెన్ తమ అత్యుత్తమ ప్రదర్శనతో రికార్డులు తిరగరాస్తుంటే మరికొందరు బ్యాట్స్ మెన్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యక్తిగతంగానూ, ఐపీఎల్ సీజన్ పరంగానూ చెత్త బ్యాటింగ్ ప్రదర్శనలు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఐపీఎల్ సీజన్లో నమోదైన చెత్త బ్యాటింగ్ రికార్డుల్ని ఓసారి చూద్దాం..

ఈసారి సీజన్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన పలువురు బ్యాట్స్ మెన్ నిరాశపరుస్తున్నారు. అలాగే ఐపీఎల్ వేలంలో భారీ మొత్తాలకు అమ్ముడైన వీరంతా తమ ప్రదర్శన విషయంలో మాత్రం పూర్తి భిన్నంగా కనిపిస్తున్నారు. ఇలాంటి బ్యాట్స్ మెన్ లో మొదటి ఐదు స్ధానాల్లో ఉన్న బ్యాట్స్ మెన్ లను గమనిస్తే ప్లే ఆఫ్ కు దూసుకెళ్లిన డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా తొలి స్ధానంలో ఉన్నాడు.

IPL 2023

హార్ధిక్ పాండ్యా ఈ సీజన్లో 12 మ్యాచ్‌లలో 289 పరుగులు చేసినా స్ట్రైక్ రేట్ మాత్రం 130 దాటలేదు. అలాగే లక్నో టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ దీపక్ హుడా కూడా ఈ సీజన్లో కేవలం 17, 2, 7, 9, 2, 2, 2, 11*, 1, 11, 5 స్కోర్లు నమోదు చేశాడు. హుడా బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ కూడా కేవలం 89.61. ఇదే కోవలో సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.8.25 కోట్లకు తెచ్చుకున్న మాయాంక్ అగర్వాల్ కూడా 9 మ్యాచ్ లలో 187 పరుగులు మాత్రమే చేశాడు. కోల్ కతా స్టార్ బ్యాట్స్ మెన్ ఆండ్రీ రస్సెల్ కూడా 13 మ్యాచ్ లు ఆడి కేవలం 220 పరుగులు చేశాడు. ఇదే క్రమంలో ఢిల్లీ యువ బ్యాట్స్ మెన్ పృధ్వీ షా బ్యాట్‌తో ఆకట్టుకోలేక పోవడంతో 6 మ్యాచ్ ల తర్వాత డీసీ పక్కనబెట్టింది. షా 6 మ్యాచ్ ల్లో కేవలం 47 పరుగులు మాత్రమే చేశాడు.

వీరందరినీ ఆయా జట్లు భారీ మొత్తాలకు కొనుగోలు చేయడమే కాకుండా ఈ సీజన్ లో వీరిపై భారీ ఆశలు పెట్టుకున్నాయి. కానీ వారు ఏ మ్యాచ్ లోనూ తమ జట్లు ఆశించిన మేరకు ప్రదర్శన చేయకపోగా.. కనీసం తాము తీసుకుంటున్న డబ్బులకు కూడా న్యాయం చేయడం లేదు. దీంతో వీరిని వచ్చే సీజన్ కు వదిలించుకునే ఆయా జట్లు పరిశీలించే అవకాశముంది. ఈ సీజన్లో ఆయా బ్యాట్స్ మెన్ పేలవ ప్రదర్శన ఆయా జట్ల అవకాశాలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+