Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL 2023 : ఈసారి మ్యాచ్ ల ప్రసారం ఈ ఛానళ్లలో, ఓటీటీలో-విదేశాల్లో చూడాలంటే..

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఆరంభానికి మరో ఆరు రోజులు మాత్రమే ఉంది. ఐపీఎల్ 2023 కోసం అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ లను వీక్షించేందుకు అభిమానులు కూడా అంతే ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది బుల్లితెరలపై మ్యాచ్ లను లైవ్ లో వీక్షించేందుకు ఉన్న అవకాశాలను ఓసారి తెలుసుకుందాం..

ఈసారి IPL 2023 సంప్రదాయ హోమ్ ఫార్మాట్ లో భాగంగా ప్రతీ ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్టు 14 గేమ్‌లు ఉండే లీగ్ దశలో కనీసం ఏడు మ్యాచ్ లు సొంత గడ్డపై ఆడుతుంది. అలాగే ఈసారి టోర్నీలో కొన్ని మార్పులు చేశారు. ఇందులో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తీసుకురావడంతో పాటు టాస్ తర్వాత రెండు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ ప్రకటించేలా నిబంధనలు మార్చారు. అలాగే IPL 2023 ప్రత్యక్ష ప్రసారాలు కూడా కొత్త రూపు సంతరించుకుంటున్నాయి.

IPL 2023 : you can watch ipl matches live telecast in these channels and OTTs

గతేడాది బీసీసీఐ వచ్చే ఐదేళ్ల కాలానికి ఐపీఎల్ మీడియా హక్కుల కోసం టెండర్ ఆహ్వానించింది. ఇందులో డిజిటల్,టీవీ హక్కులపై బీసీసీఐ రూ.48,390 కోట్ల భారీ మొత్తాన్ని సంపాదించింది. ఐపీఎల్ మీడియా హక్కులలో ప్రేక్షకుల కోసం మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారంతో పాటు ప్రసార సేవలు కూడా ఉన్నాయి. డిస్నీ హాట్ స్టార్ రూ. 23,575 కోట్లు ( ప్రతీ గేమ్ కు రూ.57.5 కోట్ల చొప్పున) వెచ్చించడం ద్వారా ఐపీఎల్ ప్రసార హక్కులను 2023-2027 కాలానికి మరోసారి పొందింది. అలాగే వయాకామ్ 18 డిజిటల్ హక్కులను రూ.23,578 కోట్లకు సంపాదించింది. డిస్నీ హాట్ స్టార్ తన ప్రసార హక్కులను నిలబెట్టుకుంది.అయితే Viacom18 గత ప్లేయర్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ను వెనక్కి నెట్టి మొత్తం డిజిటల్ హక్కులపై నియంత్రణ సాధించింది.

ఈ ఏడాది భారత్ లో ఐపీఎల్ హక్కుల్ని స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానళ్లు, జియో సినిమా సొంతం చేసుకున్నాయి. అలాగే ఓటీటీలో డిస్నీ హాట్ స్టార్ కూడా లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వబోతోంది. యూకేలో స్కైస్పోర్ట్స్ క్రికెట్, స్కైస్పోర్ట్స్ మినీ ఈవెంట్ ప్రసారం చేస్తాయి. యూఎస్ లో విల్లో టీవీ, ఆస్ట్రేలియాలో ఫాక్స్ స్పోర్ట్స్, మిడిల్ ఈస్ట్ లో టైమ్స్ ఇంటర్నెట్, దక్షిణాఫ్రికాలో సూపర్ స్పోర్ట్, పాకిస్తాన్ లో యుప్ టీవీ, న్యూజీలాండ్ లో స్కై స్పోర్ట్, కరీబియన్ దీవుల్లో ఫ్లోస్పోర్ట్స్, కెనడాలో విల్లో టీవీ, బంగ్లాదేశ్ లో గాజీ టీవీ, ఆప్ఘనిస్తాన్ లో అరియానా టెలివిజన్ నెట్ వర్క్, నేపాల్, మాల్దీవులు, శ్రీలంకలో స్టార్ స్పోర్ట్స్, యుప్ టీవీ, సింగపూర్ లో స్టార్ హబ్ ఐపీఎల్ మ్యాచ్ ల్ని ప్రసారం చేయబోతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+