సీఎంకు తగులుకున్న బెట్టింగ్ యాప్ కేసు

ముంబై: మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app).. ఇప్పుడు దేశవ్యాప్తంగా దీని చుట్టూ కథ నడుస్తోంది.. ప్రత్యేకించి ఛత్తీస్‌గఢ్‌లో. ఆ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు సంధించడానికి కారణమైంది. ఏకంగా ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌నే ఇరుకున పెడుతోంది.

మనీ లాండరింగ్ కోసం కొత్త యూజర్లు, కొత్త యూజర్ ఐడీలను క్రియేట్ చేయడం, బినామీ బ్యాంక్ అకౌంట్లకు డబ్బులను బదిలీ చేయడం అనేవి ఈ యాప్ కార్యకలాపాలు. సౌరభ్ చంద్రకర్‌, రవి ఉప్పాలీ ఈ బెట్టింగ్ యాప్‌ రూపకర్తలు. దుబాయ్ నుంచి తమ వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తోన్నారు.

Is Mahadev betting app trouble CM Bhupesh Baghel

గతంలో పలువురు బాలీవుడ్ సెలెబ్రెటీలు టార్గెట్ అయ్యారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి నోటీసులను అందుకున్నారు. కొందరు విచారణకు సైతం హాజరయ్యారు. ఇప్పుడు అదే బెట్టింగ్ యాప్ రాజకీయంగా ప్రకంపనలను సృష్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులను సృష్టిస్తోంది.

ఈ యాప్ ద్వారా భూపేష్ బఘేల్‌కు 508 కోట్ల రూపాయల మేర ముడుపులు అందినట్లు ఆరోపిస్తోంది ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ. దీనికి సంబంధించిన ఓ కీలక వీడియోను విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఈ వ్యవహారం కాస్తా కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది. దీనిపై వివరణలను ఇచ్చుకోవాల్సి వస్తోంది.

దుబాయ్‌లో గాంబ్లింగ్ బిజినెస్‌ను ఏర్పాటు చేయడానికి తాను భూపేష్ బఘేల్‌కు 508 కోట్ల రూపాయలను మళ్లించినట్లు శుభం సోని అనే వ్యక్తి చేసిన ప్రకటన తాలూకు వీడియోను బీజేపీ విడుదల చేసింది. దీన్ని ఆధారంగా చేసుకుని, ముఖ్యమంత్రిపై ఘాటు ఆరోపణలను సంధిస్తోంది.

ఈ సిండికేట్‌లో భూపేష్ బఘేల్‌తో పాటు ఆయన కుమారుడు బిట్టు, రాజకీయ సలహాదారు వినోద్ వర్మ, ఓ ఐపీఎస్ అధికారి ప్రమేయం ఉందంటూ బీజేపీ ఆరోపిస్తోంది. తక్షణమే ఆయన తన పదవికి రాజీనామా చేయడంతో పాటు కేసులను ఎదుర్కోవాలంటూ డిమాండ్ చేసింది. దీన్ని కాంగ్రెస్ తిప్పికొడుతోంది.

ఎన్నికల వేళ ఇలాంటి చీప్ ట్రిక్స్‌ను ప్రయోగించడం బీజేపీకి బాగా అలవాటైందంటూ భూపేష్ బఘేల్ ఎదురుదాడికి దిగారు. జాతీయ స్థాయిలో సర్వేలన్నీ తమ పార్టీకి అనుకూలంగా ఉండటం వల్ల బురదజల్లే ప్రయత్నానికి పూనుకుందని ధ్వజమెత్తారు. మరోసారి ఘోర పరాజయం తప్పదనీ హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+