Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హాట్: ముంబై వీధుల్లో స్లీవ్‌లెస్ టాప్, స్కర్ట్‌తో యువతి

Is Mumbai really safe for women in mini skirt?
ముంబై: న్యూయార్క్ వీధుల్లో మహిళల వేధింపులను కన్నులకు కట్టేలా తీసిన ఓ వీడియో ఇటీవల హల్‌చల్ సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో మహారాష్ట్ర రాజధాని ముంబైలోను తీసినట్లుగా కనిపిస్తోంది. ముంబైలో ఓ యువతి నడి వీధుల్లో నడిచినట్లుగా ఉన్న వీడియో ఒకటి ఇంటర్నెట్లో కనిపిస్తోంది.

న్యూయార్క్ తరహాలో ముంబైలోను ఓ మహిళ ఒక్కరే నడిచారు. దాదర్ ఈస్ట్ నుంచి అంధేరి, బాంద్రా నుంచి కుర్లా వరకు అన్ని ప్రాంతాలను చూట్టేసిందట. అయితే, ఒక్కరూ కూడా ఆమెపై వ్యాఖ్యలు చేయలేదట. స్లీవ్ లెస్ టాప్, మోకాళ్ల పైకి స్కర్ట్‌తో ఆమె కాస్తంత రెచ్చగొట్టే విధంగానే ఉన్నా, ఎవరూ అనుచితంగా ప్రవర్తించలేదట.

ఈ వీడియోలో సదరు యువతి జనాలు ఎక్కువగా ఉండే వీధుల్లో షార్ట్ స్కర్ట్‌తో నడిచారు. ఈ వీడియో మూడు నిమిషాల పాటు ఉంది. తద్వారా, ముంబై నగరం మహిళలకు ఎంత సురక్షితమైనదో స్పష్టమవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడీ వీడియో యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది.

అయితే, దీని పైన కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ వీడియోలో పూర్తిగా ఆమె జర్నీ లేదంటున్నారు. వీడియోను చాలా ఎడిట్ చేసి ఉండవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముంబై నగరం మహిళలకు సురక్షితమైనదని చెప్పేందుకు ఇలా చేయవచ్చునని అంటున్నారు.

కాగా, వీధుల్లో మహిళల పైన వేధింపుల గురించి న్యూయార్క్ వీధుల్లో ఓ వీడియో తీసిన విషయం తెలిసిందే. ఇది యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయి సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఆ వీడియోకు యూట్యూబ్‌లో ఏకంగా మూడున్నర కోట్ల వ్యూస్ వచ్చాయి.

అమెరికాలోని న్యూయార్క్ వీధుల్లో మహిళ ఒంటరిగా నడుస్తుండగా రహస్య కెమెరాలతో దీనిని చిత్రీకరించారు. ఆ సమయంలో ఆమెను పలువురు కామెంట్ చేసిన విషయం తెలిసిందే. వెంటపడి వేధింపులకు గురి చేశారు. న్యూయార్క్ నగరంలోని వీధుల్లో మహిళల పైన జరుగుతున్న వేధింపులను తెలిపేందుకు కొద్ది రోజుల ఓ షార్ట్ ఫిలిం తీశారు. ఈ చిత్రీకరణలో పాల్గొన్న యువతికి అత్యాచార బెదిరింపులు కూడా వచ్చాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+