ఐఎస్ ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లోనూ కమలేశ్ తివారీ.. రెండేళ్ల క్రితమే..
హిందూ సమాజ్ పార్టీ నేత, హిందు మహాసభ లీడర్ కమలేశ్ తివారీ హత్య తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నాం లక్నోలోని పార్టీ కార్యాలయంలోనే దుండగులు కత్తితో పొడిచి హతమార్చిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందు అతని మట్టుబెట్టేందుకు ఐఎస్ ఉగ్రవాదులు ప్రయత్నించారనే విషయం వెలుగులోకి వచ్చింది.
కమలేశ్ తివారీని ఐఎస్ ఉగ్రవాదులు హతమార్చేందుకు 2017లోనే ప్రయత్నించారని యాంటీ టెర్రరింజ స్కాడ్ (ఏటీఎస్) అధికారులు తెలిపారు. అతను ఐఎస్ ఉగ్రవాదుల హిట్ లిస్ట్‌లో కూడా ఉన్నారని అంశం హత్య తర్వాత వెలుగులోకి వచ్చింది. 2017లో గుజరాత్ ఏటీఎస్ అధికారులు ఐఎస్ ఉగ్రవాదులు ఉబైద్ మిర్జా, ఖాసీమ్‌ను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా తమ టార్గెట్‌లో కమలేశ్ తివారీ కూడా ఉన్నారని పేర్కొన్నారు.

అప్పుడు ఏటీఎస్ అధికారులు ఉగ్రవాదులు చెప్పిన అంశంపై చార్జీషీట్ కూడా దాఖలు చేశారు. కమలేశ్‌ను హతమార్చేందుకు కుట్రపన్నారని అభియోగాలు కూడా మోపారు. 2015లో కమలేశ్ తివారీ మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఉగ్రవాదులకు, ముస్లింలకు కమలేశ్ అంటే గిట్టదు. శుక్రవారం కమలేశ్‌ను మట్టుబెట్టింది కూడా ఉగ్రవాదులేనని పోలీసులు భావిస్తున్నారు.
కమలేశ్ లక్నోలోని తన కార్యాలయంలో ఉండగా శుక్రవారం మధ్యాహ్నం కొందరు కాషాయ వస్త్రాలు ధరించి లోపలికి వచ్చారు. రెండు స్వీట్ బాక్సులు తమ వెంట తీసుకొచ్చారు. అందుల్లోంచి తుపాకీ తీసి కాల్చారు. తర్వాత కత్తితో గొంతు కోశారు. దాదాపు 15 సార్లు కత్తితో పొడిచినట్టు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. తర్వాతే అక్కడినుంచి పారిపోయినట్టు విజువల్‌లో కనిపించింది. సంఘటనస్థలంలో పిస్టోల్, బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications