ISRO: మరో ఘనత సాధించిన ఇస్రో.. 36 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి పంపి రికార్డు..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) మరో ఘనత సాధించింది. ఒకేసారి 36 ఉపగ్రహాలను (Satellites) నింగిలోకి పంపి రికార్డు సృష్టించింది. ఈ ఉపగ్రహాలు వన్ వెబ్ (OneWeb) ఇంటర్నెట్ సంస్థకు చెందినవి. బ్రాడ్ బ్యాండ్ (Broad Band) సేవలను మరింత మెరుగుపర్చడానికి జెన్- 1 కాన్స్టెలేషన్ నెట్ వర్క్ శాటిలైట్లను ప్రయోగించడానికి వెన్ వెబు ఇస్రో సహకారాన్ని తీసుకుంది.
వన్ వెబ్ (OneWeb) ఇంటర్నెట్ బ్రిటన్ కు చెందిన కంపెనీ. బ్రిటన్ కు చెందిన నెట్ వర్క్ యాక్సెస్ అసోసియేట్స్ లిమిటెడ్ గ్రూప్ లో వన్ వెబ్ ఒకటి. మొత్తంగా 72 శాటిలైట్లను లో-ఎర్త్ ఆర్బిట్ లో ప్రవేశపెట్టడానికి ఇస్రోతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఇస్రో ఆదివారం 36 ఉపగ్రహాలను నింగిలోకి పంపించింది. ఈ 36 ఉపగ్రహాలను లాంచ్ వెహికల్ మార్క్-3 (LVM 3) విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఒక్కొక్క ఉగ్రహం బరువు 150 కిలోలు ఉన్నట్లు ఇస్రో తెలింది.

ఇస్రో వివిధ దశల్లో ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. మొదటి దశలో 1K, 5K, 3K,7K ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపారు. రెండో దశలో 2A, 4A, 6A, 8A ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. మూడో దశలో 1A, 3A, 5A, 7A కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. నాలుగో దశలో 2B, 4B, 6B, 8B కక్ష్యలోకి ప్రవేశ పెట్టారు. ఆ తర్వాత వివిధ దశల్లో 1B, 3B, 5B,7B, 2C, 4C, 6C, 8C, 1C, 3C, 5C,7C, 2D, 4D, 6D, 8D, 1D, 3D, 5D, 7D ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదివారం ఉదయం 9 గంటలకు ఈ ప్రయోగం నిర్వహించింది. వన్ వెబ్ ఈ ప్రాజెక్ట్ కోసం గతంలో రష్యా సహాయాన్ని కోరింది వన్ వెబ్ సంస్థ. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో- అంతరిక్ష కార్యకలాపాలు, సోయుజ్ రాకెట్ ప్రయోగాన్ని నిలిపివేసింది. దీనితో ఇస్రో సహకారాన్ని తీసుకుంది. గ్లోబల్ బ్రాడ్ బ్యాండ్ కవరేజీని మరింత మెరుగుపర్చడానికి 588 ఉపగ్రహాల ప్రారంభించాలంటూ వన్ వెబ్ సంస్థ తన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది.
-
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
74 రూపాయలకే 12 వేల కోట్ల ఆస్తి! అపర కుబేరుడి పతనం -
SPG గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
కుప్పకూలిన ధరలు: సీజ్ ఫైర్ దెబ్బకు -
పెద్దిని ఎదుర్కొనడం అంటే సాహసమే












Click it and Unblock the Notifications