ISRO: ఎస్ఎస్ఎల్వీ -డీ 3 ప్రయోగం సక్సెస్..!!
షార్ నుంచి ఇస్రో చేపట్టిన ప్రయోగం విజయవంతం అయింది. ఈ వాహన నౌక 175 కిలోల ఈవోఎస్ -08 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలో ప్రవేశ పెట్టింది. విపత్తు నిర్వహణలో సమాచారం ఇచ్చేందుకు ఈ ఉపగ్రహం సహకరించనుంది. పర్యావరణం తో పాటుగా విపత్తులు, అగ్నిపర్వతాల పై పర్యవేక్షణ చేయనుంది. ప్రయోగం విజయవంతం కావటం పైన ఇస్రో ఛైర్మన్ సోమనాధ్ శాస్త్రవేత్తలను అభినందనలు తెలిపారు. దాదాపు 17 నిమిషాల వ్యవధిలో ఉపగ్రహం కక్ష్య లోకి చేరింది.
ఎస్ఎస్ఎల్వీ -డీ 3 ప్రయోగం సక్సెస్ అయింది. అర్ధరాత్రి ఎస్‌ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. షార్ నుంచి ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్‌ను నేడు (శుక్రవారం) ఉదయం 9.17 గంటలకు నింగిలోకి లాంచ్ చేసారు. ఇస్రో చైర్మన్ సోమనాథ్ శాస్త్రవేత్తలతో కలిసి ప్రయోగం పర్యవేక్షించారు. షార్‌లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగం ప్రారంభించారు. ఈ ప్రయోగం ద్వారా నింగిలోకి ఈఓఎస్ -08 శాటిలైట్ పంపారు. ఈవోఎస్ -08 ఉపగ్రహం భూ పరిశీలన చేస్తుందని సోమనాధ్ వెల్లడించారు.

ఈ ప్రయోగం ద్వారా నింగిలోకి పంపిన ఈఓఎస్ -08 శాటిలైట్ ఉపగ్రహం భూ పరిశీలన చేయనుందని వివరించారు. ఈ ఏడాదిలో పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం ద్వారా ప్రోబ్ శాటిలైట్ నింగిలోకి వెళ్తుందన్నారు. నాసా నిస్సార్ ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ, ఎం కె3, ఎల్వీఎం 3 రాకెట్ ప్రయోగాల ద్వారా నింగిలోకి విభిన్న ఉపగ్రహాలు పంపనున్నట్లు ప్రకటించారు. మరో ఏడాదిలో రాడార్ ఇమేజింగ్ శాటిలైట్, జియో ఇమేజింగ్ శాటిలైట్, టెక్నాలజీ డెవలప్‌మెంట్ శాటిలైట్, టీడీఎస్ రాకెట్ ప్రయోగాలకు సిద్ధమవుతుందని చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.
ఎస్ఎస్ఎల్వీ-డీ3 రాకెట్ బరువు 119 టన్నులు, ఎత్తు 34 మీటర్లు, వెడల్పు 2 మీటర్లుగా ఉన్నాయి. భూ ఉపరితలం నుంచి 475 కి.మీ ఎత్తున శాటిలైట్‌ని కక్ష్యలోకి ప్రవేశపెట్టేలా డిజైన్ చేశారు. ఈవోఎస్-08 శాటిలైట్ బరువు 175.5 కిలోలు. శాటిలైట్‌లో మూడు పే లోడ్స్‌ని ఇస్రో శాస్త్రవేత్తలు అమర్చారు. భూ పరిశీలన, విపత్తు పర్యవేక్షణ, పర్యావరణ పరిరక్షణ, రక్షణ రంగానికి సంబంధించిన సేవల కోసం ఈ శాటిలైట్‌ను రూపొందించారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications