sex scandal: బెడ్ మీద మరకలకు నాకు సంబంధం లేదు, మాజీ ఎంపీ ప్రజ్వల్ షాక్
హాసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ కేసు కర్ణాటక రాష్ట్రంంతో పాటు దేశ, విదేశాల్లో హల్ చల్ చేస్తోంది. ఇప్పుడు అత్యాచారం కేసులో నిందితుడిగా అరెస్టు అయిన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ప్రజ్వల్ రేవణ్ణ ఇంట్లో బెడ్ షీట్లపై అనుమానాస్పదంగా కనిపించిన గుర్తుల గురించి సిట్ అధికారులు అతన్ని ప్రశ్నించిందని తెలిసింది.
అయితే ఈ విషయంపై ప్రజ్వల్ రేవణ్ణ స్పందించిన తీరుతో సిట్ అధికారులు షాక్ అయ్యారని తెలిసింది. ప్రజ్వల్ ఇంట్లోని డబుల్ కాట్ బెడ్ మీద ఉన్న బెడ్ షీట్ మరకలపై సిట్ ఆయన్ను ప్రశ్నించిందని తెిసింది. ఆ మరకలతో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సిట్ అధికారులకు చెప్పినట్లు సమాచారం. మే 29వ తేదీన కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ రాగానే బెంగళూరులోని బసవనగుడిలోని ప్రజ్వల్ రేవణ్ణ ఇంట్లో సిట్ సోదాలు చేసింది.

సిట్ సోదాలు చేసిన ఒక రోజ తరువాత ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరుకు రావడంతో ఆయన్ను కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే సిట్ అధికారులు అరెస్టు చేశారు. విదేశాల నుంచి ప్రజ్వల్ రాక ఒకరోజు ముందు నిర్వహించిన ఈ తనిఖీలో అనుమానం వచ్చి ఇంటిలోని ప్రజ్వల్ రేవణ్ణ బెడ్ రూమ్ లోని కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకుని వాటి వివరాల గురించి కోర్టుకు తెలియజేశారు.
ఈ కేసులో రెండో నిందితుడు హెచ్ డీ రేవణ్ణ ఇంట్లో సోదాలు నిర్వహించి విచారణకు అవసరమైన కొన్ని వస్తువులను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులలో డబుల్ కాట్‌పై అక్కడక్కడా అనుమానాస్పద మరకలతో కూడిన బెడ్‌స్ప్రెడ్ కనిపించిందని, ఈ మరకల గురించి ప్రజ్వల్‌ను ప్రశ్నించగా, దానితో తనకు సంబంధం లేదని చెప్పాడని సిట్ అధికారులు అంటున్నారని కన్నడ మీడియా తెలిపింది.
సింగల కాట్ బెడ్ మీద అనుమానాస్పద మరకలు, గ్రే కలర్ వాల్‌పేపర్, దానిపై వెండి రంగు పడి ఉన్న సమాచారం గుర్తించిన సిట్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని నిపుణుల పరిశీలనకు పంపినట్లు సమాచారం. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అశ్లీల వీడియోలు తీసిన మొబైల్ ఫోన్ కూడా ప్రజ్వల్ వద్ద కనిపించలేదు. మొబైల్ ఎక్కడ ఉందని ప్రశ్నిస్తే ఏడాది క్రితం ఆ మొబైల్ పోయిందని, హాసన్ జిల్లాలోని హలేనరసీపుర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశామని ప్రజ్వల్ సమాధానం ఇచ్చాడని తెలిసింది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉందని సిట్ అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications