అభిమానులకు సల్మాన్ కృతజ్ఞతలు: సినిమా కోసం కాశ్మీర్‌కు
ముంబై: తనకు మద్దతుగా నిలబడిన అభిమానులందరికీ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు. హిట్ అండ్ రన్ కేసులో ముంబై సెషన్స్ కోర్టు ఆయనకు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వగా దాన్ని బాంబే హైకోర్టు నిలిపివేసిన విషయం తెలిసిందే.
ఈ సమయంలో అభిమానులంతా సల్మాన్ ఇంటి ముందు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆయనకు బెయిల్ లభించిందని తెలియడంతో ఆనందంతో టపాసులు పేల్చుతూ నృత్యాలు చేశారు.

ఇది ఇలా ఉండగా, కోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో సల్మాన్ ఖాన్ సినిమా షూటింగ్ కోసం కాశ్మీర్ బయల్దేరారు. కాశ్మీర్‌లో జరగనున్న‘భజరంగ్ భాయిజాన్'చిత్ర షూటింగ్‌లో పాల్గొననున్నారు.












Click it and Unblock the Notifications