ఐటీబీపీలో 134 కానిస్టేబుళ్లు పోస్టులు: అప్లై చేయండి

హైదరాబాద్: ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ)లో 134 గ్రూప్-సీ(నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టిరియల్) కానిస్టేబుల్ పోస్టులకు భారతీయ పౌరులైన యువకుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. తాత్కాలికంగా తీసుకున్నా.. శాశ్వతమయ్యే అవకాశం ఉంటుంది.

ఎంపికైన అభ్యర్థులను దేశంలో ఎక్కడైనా లేదా ఇతర దేశాల్లోనైనా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఐటీబీపీఎఫ్ చట్టం 1992, ఐటీబీపీఎఫ్ నిబంధనలు 1994లను అనుసరించి నియామకం జరుగుతుంది. ఆన్‌లైన్లో మాత్రమే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఇతర మార్గాల ద్వారా దరఖాస్తులు అనుమతించబడవు.

సంస్థ పేరు: ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్

పోస్టు పేరు: కానిస్టేబుల్

ఖాళీల సంఖ్య: 134

జాబ్ లొకేషన్: భారతదేశంలో ఎక్కడైనా.

చివరి తేదీ: మార్చి 15, 2018

జీతం వివరాలు: రూ. . 21,700 - 69,100/-

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి లేదా సంస్థ నుంచి మెట్రిక్యూలేషన్ లేదా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లైట్ లేదా మీడియం లేదా హెవీ మోటార్ వెహిల్ లైసెన్స్ కలిగి ఉండాలి. డ్రైవింగ్‌లో రెండేళ్ల అనుభవం ఉండాలి.

వయో పరిమితి: 15.03.2018 నాటికి 21-27ఏళ్ల వయస్సు ఉండాలి.

ముఖ్య తేదీలు:

రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 14.02.2018

చివరి తేదీ: 15.03.2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+