వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హల్వా వండిన జైట్లీ, వందమందికి పైగా అధికారులను లాక్ చేశారు!

కేంద్ర బడ్జెట్ ముద్రణ ప్రారంభ సూచకంగా ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, ఆర్థిక శాఖకు చెందిన ఇతర అధికారులు గురువారం హల్వా వంటకంలో పాల్గొన్నారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ ముద్రణ ప్రారంభ సూచకంగా ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, ఆర్థిక శాఖకు చెందిన ఇతర అధికారులు గురువారం హల్వా వంటకంలో పాల్గొన్నారు. ఆర్థిక కార్యదర్శి అశోక్ లవాసా, రెవెన్యూ కార్యదర్శి హన్ముఖ్ అధియా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్, ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ పాల్గొన్నారు.

తద్వారా, 2017-18 వార్షిక బడ్జెట్‌ ప్రతుల ముద్రణ పనులకు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఎప్పటిమాదిరిగానే ఆనవాయితీగా వస్తున్న హల్వా వేడుకను ఢిల్లీలోని నార్త్‌ బ్లాక్‌ కార్యాలయంలో నిర్వహించారు.

<strong>ఇండియన్‌ను, ఏం మీరు ట్రంప్‌కు భయపడుతున్నారా: ప్రియాంక చోప్రా ధీటైన జవాబు</strong>ఇండియన్‌ను, ఏం మీరు ట్రంప్‌కు భయపడుతున్నారా: ప్రియాంక చోప్రా ధీటైన జవాబు

Jaitley participates in ‘Halwa ceremony’, to mark beginning of Budget 2017 printing process

చాలా ఏళ్ల నుంచి వస్తోన్న ఈ సాంప్రదాయంలో హల్వాను తయారు చేసి, ఆర్థిక శాఖలోని మొత్తం సిబ్బందికి పంచుతారు. హల్వా వేడుక అనంతరం బడ్జెట్‌ ప్రసంగం వరకూ, 100కు పైగా ఆర్థిక శాఖ అధికారులు బడ్జెట్‌ ముద్రణాలయంలోనే ఉండిపోతారు.

వీరికి బాహ్య ప్రపంచంతో సంబంధాలుండవు. బడ్జెట్‌లోని అంశాలను రహస్యంగా ఉంచేందుకు ఇలా చేస్తారు. కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఫోన్లు, ఇ-మెయిల్‌, ఇతర ఏ రూపంలోనైనా సమాచారం చేరేవేసే వీలుండదు. బడ్జెట్‌ రోజు వరకు వీరు ఇంటికి సైతం వెళ్లకూడదు. ఆర్థిక శాఖ కొంతమంది ఉన్నతాధికారులకు మాత్రం ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది.

English summary
Finance Minister Arun Jaitley marked the beginning of the printing of 2017-18 Budget documents with 'Halwa Ceremony' in New Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X