తలాక్‌ బిల్లుతో ముస్లిం మహిళలకు న్యాయం : జయప్రద, ‘అందుకే బీజేపీకి ఓటేశారు’

Subscribe to Oneindia Telugu

షిర్డీ: ట్రిపుల్ తలాక్‌ బిల్లుకు ప్రముఖ నటి, రాజకీయ నేత జయప్రద తన మద్దతు ప్రకటించారు. ఆ బిల్లు ముస్లిం మహిళలకు గౌరవంతో పాటు, న్యాయాన్ని చేకూరుస్తుందని ఆమె అన్నారు.

షిర్డీ సాయిబాబా ఆలయ దర్శనానికి వచ్చిన జయప్రద మీడియాతో మాట్లాడారు. తాను అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లాబోర్డును గౌరవిస్తానని.. అయితే పార్లమెంటు బిల్లును ఆమోదిస్తే ఆ నిర్ణయాన్ని బోర్డు గౌరవించాలంటూ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

Jaya Prada supports triple talaq bill

ట్రిపుల్ తలాక్‌పై గత ప్రభుత్వ విధానాలతో అసంతృప్తిగా ఉన్న ముస్లిం మహిళలు అధికశాతం ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటేశారని జయప్రద తెలిపారు. కాగా, ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Actor-turned-politician Jaya Prada today supported the proposed triple talaq bill, saying it will bring justice and respect to Muslim women.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి