శుభవార్త: మళ్లీ జియో ఫోన్ బుకింగ్స్ ప్రారంభం, కానీ వారికి మాత్రమే...
ఎట్టకేలకు రిలయన్స్ జియో గుడ్ న్యూస్ చెప్పింది. తన జియో ఫోన్ బుకింగ్స్‌ను మళ్లీ ప్రారంభించింది. అయితే, ఇంతకుముందు ఆసక్తి కనబరిచిన వారికి మాత్రమే ఈ ఫోన్ ను బుక్ చేసుకునే అవకాశం కల్పించారు.
న్యూఢిల్లీ: ఎట్టకేలకు రిలయన్స్ జియో గుడ్ న్యూస్ చెప్పింది. తన జియో ఫోన్ బుకింగ్స్‌ను మళ్లీ ప్రారంభించింది. అయితే, ఇంతకుముందు ఎవరైతే ఫోన్ కొనేందుకు ఆసక్తి కనబరిచారో వారికి మాత్రమే ఈసారి ఫోన్ బుక్ చేసేందుకు అవకాశం కల్పిస్తోంది.
ఆగస్టు 24న జియో ఫ్రీ ఫోన్‌కు బుకింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో 60 లక్షల మంది ఈ ఫోన్‌ను బుక్ చేసుకున్నారు. అంతకుముందు జులైలోనే చాలా మంది తాము ఫోన్ పట్ల ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిపారు.

అలా ఆసక్తి కనబరిచిన 10 లక్షల మందికి ఇప్పుడు మళ్లీ జియో ఎస్సెమ్మెస్‌లు పంపుతోంది. అందులో ఉన్న నంబర్‌కు ఫోన్ చేయడం ద్వారా గానీ, లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా గానీ జియో ఫోన్‌ను బుక్ చేసుకోవచ్చు.
బుకింగ్ సమయంలో రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. వారికి ఎప్పుడు ఫోన్‌ను అందజేస్తారన్నది తెలియపరుస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫ్రీ ఫోన్ పేరిట తీసుకొచ్చిన ఈ ఫోన్‌కు రూ.1500 డిపాజిట్ చెల్లించాలనే విషయం తెలిసిందే.
36 నెలల తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని తొలుత ప్రకటించిన జియో ఆ తరువాత నిబంధనలను సవరించింది. తొలి ఏడాది ఫోన్‌ను తిరిగిస్తే రూ.500, రెండో ఏడాది తిరిగిస్తే రూ.1000, మూడో ఏడాది రిటర్న్ చేస్తే రూ.1500 కంపెనీ చెల్లిస్తుంది. అయితే, ఇందుకు వినియోగదారులు ఏడాదికి కనీసం రూ.1500 ఫోన్‌కు రీఛార్జి చేయాల్సి ఉంటుంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications