BSY vs July: జులై వస్తే ఈ సీఎంకు చలి, జ్వరం, బలవంతంగా రాజీనామాలు, ఆషాడమాసం ఆఫర్ !
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు ఆషాడమాసం, జులై నెల ఏమాత్రం అచ్చువచ్చినట్లు కనపడటం లేదు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న బీఎస్. యడియూరప్ప ప్రతిసారి జులై నెలలో ఆషాడమాసం మొదలైన వెంటనే ఈ నెల గడిచిపోతే చాలు దేవుడా అంటూ భగవంతుడిని ప్రార్థిస్తుంటారు. 10 ఏళ్ల క్రితం సీఎం కుర్చీలో ఉన్న బీఎస్. యడియూరప్పకు ఎలాంటి పరిస్థితి ఎదురైయ్యిందో ఇప్పుడు అదే పరిస్థితి ఎదురైయ్యింది. 2011 జులై 31వ తేది బీజేపీ హైకమాండ్ ఆదేశాల మేరకు సీఎం పదవికి రాజీనామా చేసిన యడియూరప్ప ఇప్పుడు మరోసారి అదే జులై నెల 26వ తేదీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నారు. ఇంతకూ జులై నెల, ఆషాడమాసం అంటేనే యడియూరప్ప చలి జ్వరం వచ్చినట్లు ఎందుకు అవుతోంది ?, ఎందకు జులై నెలలో ఆయన ఇలా హడలిపోతారో అనేదానికి ఓ బలమైన కారణం, ఓ స్టోరీ ఉంది.

జులై నెల అంటే యడియూరప్పకు హడల్
కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రావడానికి బీఎస్. యడియూరప్ప ఎంత కృషి చేశారు అనే విషయం బీజేపీ నాయకులకు, కన్నడిగులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి బీఎస్. యడియూరప్ప అనేక ప్రయత్నాలు చేశారు. ఆపరేషన్ కమలా పేరుతో బీజేపీని అధికారంలోకి తీసుకు వచ్చిన యడియూరప్పకు పత్రిసారి జులైలో అనేక ఇబ్బందులకు గురి చేసింది. జులై నెల వస్తే యడియూరప్ప ఉలిక్కిపడుతారని, ఆయనకు చలి, జ్వరం వచ్చినట్లు అయిపోతుందని ఆయన సన్నిహితులు అంటున్నారు.

2008లో సీఎం అయిన యడియూరప్ప సీఎం
2008లో సొంత బలంతో కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పట్లో బీఎస్. యడియూరప్పను కాదని బీజేపీ ఏ నాయకుడి పేరు కూడా పరిశీలించకుండా ఆయన్నే ముఖ్యమంత్రి కుర్చీ మీద కుర్చోబెట్టింది. కర్ణాటకలో బీజేపీ అంటే యడియూరప్ప, యడియూరప్ప అంటేనే బీజేపీ అనే రైంజ్ లో పరిస్థితి ఉండేది. సీఎం కుర్చిలో కుర్చున్న యడియూరప్ప ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్లిపోయారు.

సీఎంకు సినిమా చూపించిన జులై నెల
2008లో కర్ణాటక ముఖ్యమంత్రి కుర్చీలో కుర్చున్న బీఎస్. యడియూరప్పకు 2011లో అవినీతి ఆరోపణలతో ప్రతిపక్షాల విమర్శలతో సతమతం అయ్యారు. హైకమాండ్ కు సర్దిచెప్పుకుంటూ కొన్ని రోజులు గడిపిన యడియూరప్పకు 2011 జులై నెలలో సినిమా కనపడింది. సీఎం పదవికి రాజీనా చెయ్యాలని ఢిల్లీ హైకమాండ్ అదే జులై నెలలో బీఎస్. యడియూరప్పకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఆషాడ మాసంతో ఆనెల బచావ్
కర్ణాటకో బీజేపీ అధికారంలోకి రావడానికి శక్తివంచన లేకుండా పని చేశానని, తన మీద జాలి చూపించి ఆషాడమాసం పూర్తి అయ్యే వరకు సీఎంగా ఉండటానికి అవకాశం ఇవ్వాలని, ఆషాడమాసం పూర్తి అయిన వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని అప్పట్లో బీఎస్ యడియూరప్ప హైకమాండ్ కు మనవి చేశారు. హైకమాండ్ పెద్దలకు చెప్పినట్లే 2011 జులై 31వ తేదీన సీఎం బీఎస్. యడియూరప్ప ఆయన పదవికి రాజీనామా చేశారు.

పాదయాత్రతో కలకలం రేపిన యడియూరప్ప
2011 జులై 31వ తేదీన బెంగళూరులోని సీఎం అధికారిక నివాసం కృష్ణ నుంచి రేస్ కోర్స్ రోడ్డు మీదగా తన మద్దతుదారులతో పాదయాత్ర చేసుకుంటూ రాజ్ భవన్ చేరుకున్న బీఎస్. యడియూరప్ప అప్పటి కర్ణాటక గవర్నర్ హంసరాజ్ భరద్వాజ్ కు రాజీనామా లేఖ ఇచ్చేసి సీఎం కుర్చీ నుంచి దిగిపోయారు.
Recommended Video

2021 జులైలో సేమ్ సీన్ రిపిట్ ?
సంపూర్ణ మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నా 2011 జులై నెలలో సీఎం పదవికి రాజీనామా చేసిన బీఎస్ యడియూరప్పకు సరిగ్గా 10 ఏళ్ల తరువాత 2021 జులై నెలలో మరోసారి ఆయన పదవికి ఎసరు వచ్చింది. 2011లో జులై నెలలోనే సీఎం పదవికి రాజీనామా చేసిన బీఎస్ యడయూరప్ప 2021 జులై నెలలో ఆయన పదవికి రాజీనామా చెయ్యడానికి సిద్దం అయ్యారు.

శాస్త్రాలు ఊరికే చెప్పలేదు
జులై మాసం బీఎస్. యడియూరప్పకు అచ్చురాలేదు అనే విషయం ఇప్పటికే మీకు అర్థం అయి ఉంటుంది. ఆషాడమాసం పూర్తి అయిన తరువాత తన పదవికి రాజీనామా చేస్తానని యడియూరప్ప చెబుతారని అందురు అనుకున్నా ఆయన మాత్రం ఈ సారి రాజీనామా చెయ్యాలని డిసైడ్ అయిపోయారు. హైకమాండ్ చెప్పినట్లు ఆషాడమాసం పూర్తి కాకుండానే ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా చేసేస్తున్నారు.

అప్పను కరోనా కాపాడింది.... కొడుకు ఎఫెక్ట్ ?
కరోనా వైరస్ సెకండ్ వేవ్ రాకుపోయి ఉంటే మాడు నెలల క్రితమే కర్ణాటకలో సీఎంను మార్చేసే అవకాశం ఉండేదని బీజేపీలోని యడియూరప్ప ప్రత్యర్థి వర్గం నాయకులు అంటున్నారు. యడియూరప్పకు ఆయన కొడుకు బీవై. విజయేంద్ర అత్యుత్సాహం కారణంగా, లేనిపోని విషయాల్లో అతను తల దూర్చడం వలనే అప్పకు కుర్చీ దూరం అవుతోందని ఆరోపణలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications