వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కల్పన సోరెన్.. జార్ఖండ్‌కు కాబోయే సీఎం భార్య.. అక్రమ భూముల వ్యవహారంలో ఒక్కసారే లైమ్ లైట్ లోకి..

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా ప్రజల్లో గుర్తింపు ఉన్న పొలిటికల్ ఫ్యామిలీల్లో జార్ఖండ్ కు చెందిన సోరెన్ ఫ్యామిలీ ఒకటి. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని సక్సెస్ ఫుల్ గా నడిపించిన శిబు సోరెన్ ఫ్యామిలీకి లీడర్. శిబు రాజకీయ వారసుడిగి పేరుపొందిన పెద్ద కొడుకు దుర్గా సోరెన్ 2009లో అకస్మాత్తుగా చనిపోయారు. దాంతో చిన్నకొడుకు హేమంత్ సోరెన్ బాధ్యతల్ని తీసుకోకతప్పలేదు. ఈ పొలికల్ ఫ్యామిలీకి చెందిన మహిళలందరూ సగటు గిరిజన మహిళలాగే ల్రోప్రొఫైల్ మెయింటేన్ చేస్తారు. హేమంత్ భార్య కల్పన సోరెన్ మాత్రం అనూహ్యంగా ఈ ఏడాది మొత్తం వార్తల్లో నిలిచారు.

ప్రేమ పెండ్లి.. కాదు.. పెద్దలు కుదిర్చిందే..

ప్రేమ పెండ్లి.. కాదు.. పెద్దలు కుదిర్చిందే..

హేమంత్, కల్పన జంటది ప్రేమవివాహం అని, మెస్రాలోని ప్రఖ్యాత బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో హేమంత్ బీటెక్ చదివే రోజుల్లోనే వీళ్లదరూ కలిసి తిరిగేవాళ్లని ప్రచారంలో ఉంది. పర్సనల్ విషయాల్ని బయటపెట్టడానికి ఇష్టపడని హేమంత్.. తమ లవ్ స్టోరీని ఎన్నటికీ రివీల్ చేయబోనని ఓసారి మీడియాతో అన్నారు. అయితే వీళ్లిద్దరిదీ పెద్దలు కుదిర్చిన పెండ్లేనని పార్టీ వర్గాలు చెబుతాయి.

 రాంచీ ఎలీట్ సెక్షన్ లో ఆమెకు గుర్తింపు..

రాంచీ ఎలీట్ సెక్షన్ లో ఆమెకు గుర్తింపు..

మీడియాకు దూరంగా ఉండే కల్పన సోరెన్.. రాంచీ ఎలీట్ సెక్షన్స్ వేడుకలకు, ఫిక్కీ లాంటి సంస్థలు నిర్వహించే కార్యక్రమాలకు అప్పుడప్పుడూ హాజరవుతారు. భర్త హేమంత్ తో కలిసి చాలా సార్లు పబ్లిక్ ఈవెంట్స్ లో పాల్గొన్నప్పటికీ ఆమె పెద్దగా మాట్లాడరు. ఇద్దరు పిల్లలు.. ఇల్లు.. అన్నట్లుగానే వ్యవహరిస్తారు. అలాంటి కల్పన ఈ ఏడాది ప్రారంభం నుంచే వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచారు.

భూకొనుగోలు వివాదం..

భూకొనుగోలు వివాదం..

కల్పన ఈ ఏడాది జనవరిలో రాంచీలో సుమారు 60 ఎకరాల భూమిని కొనుగోలు చేయడం వివాదాస్పదమైంది. గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా డీల్ కుదుర్చుకున్నారని, ఉద్దేశపూర్వకంగా అమ్మందారును మోసం చేశారని ఆమెపై విమర్శలు వచ్చాయి. అధికారులు ఆమెకు నోటీసులు కూడా జారీచేశారు. అధికార బీజేపీ నేతలు అసెంబ్లీలోనూ కల్పన భూకొనుగోలు అంశాన్ని లేవనెత్తారు. ఎన్నికల ప్రచారంలోనూ బీజేపీ.. దీన్నొక ఆయుధంగా వాడుకునే ప్రయత్నం చేసింది.

కల్పన పాత్ర ఎలా ఉండబోతున్నది..

కల్పన పాత్ర ఎలా ఉండబోతున్నది..

అయితే, భూమి కొనుగోలులో ఎలాంటి అక్రమాలు లేవని జేఎంఎం ప్రకటించింది. భూమి కొనుగోలు తలనొప్పి వ్యవహారంగా మారడంతో కల్పన కొన్నాళ్లపాటు మీడియాకు ముఖంచాటేశారు. మళ్లీ ఎన్నికల టైమ్ లో భర్తతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. మామగారు శిబుసోరెన్ మూడు సార్లు సీఎం.. భర్తగారేమో రెండోసారి సీఎం పీఠమెక్కబోతున్నారు. మున్ముందు రోజుల్లో హేమంత్ సోరెన్ ఇంట్లోగానీ, పాలనలోగానీ ఆమె ముద్ర ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

English summary
what do you know about kalpana soren, Wife Of Jharkhand chief minister designate Hemant soren, she gets notices for purchasing disputed land
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X