ఇంకా మిగిలే ఉంది: బరువెక్కిన గుండెతో..ముంబైని వీడుతున్నా: ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్
మహారాష్ట్ర సర్కార్ తో, సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో వివాదానికి దిగిన కంగనా రనౌత్ ఐదు రోజులపాటు ముంబైలో గడిపిన తర్వాత నేడు తన స్వస్థలమైన మనాలికి బయల్దేరి వెళ్లారు. భారమైన హృదయంతో ముంబై నగరాన్ని వీడుతున్నానని ట్వీట్ చేసిన కంగనా రనౌత్ తనపై జరిగిన మాటల దాడిని, తన ఆఫీసు పై జరిగిన విధ్వంసాన్ని సోషల్ మీడియా వేదికగా మరోసారి ప్రస్తావించారు.
ఇన్ని రోజులు ఇక్కడ తనను ఎన్ని భయభ్రాంతులకు గురి చేశారో , ఎన్ని దుర్భాషలాడారో, ఎంతగా తన ఆఫీస్ ను విధ్వంసం చేశారో చూస్తే తాను చేసిన పాక్ ఆక్రమిత కాశ్మీర్ అన్న కామెంట్ కరెక్టే అనిపిస్తుంది.

కామెంట్ మరింత పెద్ద శబ్దంగా, ఎంతటి విస్పోటనంగా మారిందో అర్థమవుతుందని కంగనా రనౌత్ తాను చేసిన ట్వీట్ లో పేర్కొంది. శివసేనకు, కంగనాకు మధ్య తలెత్తిన పెను తుఫాను మహారాష్ట్రను కుదిపివేసిన వేళ ముంబైలో ఆమె ఇంట్లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు జరిగాయని, బీఎంసీ భవన నిర్మాణాల కూల్చివేతకు దిగింది.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనారనౌత్ అనేక వివాదాల మధ్య సెప్టెంబర్ 9వ తేదీన ముంబై నగరానికి చేరుకున్నారు. అనూహ్య సంఘటనలు, పరిణామాల మధ్య ముంబై నగరాన్ని వీడి వెళుతున్న కంగనా రనౌత్ ట్విటర్లో భారమైన హృదయంతో ముంబై విడిచి వెళుతున్నట్లుగా పేర్కొన్నారు. అంతకు ముందు రక్షకులే విధ్వంసకరమైనప్పుడు వారు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తారని వ్యాఖ్యానించారు కంగనారనౌత్.
నన్ను భయపెట్టడానికి ప్రయత్నించడం ద్వారా, నన్ను బలహీనంగా పరిగణించడం ద్వారా, నన్ను కించపరచడం ద్వారా వారు తప్పు చేస్తున్నారంటూ, వారి నిజస్వరూపాలు బయటపడ్డాయి అంటూ వ్యాఖ్యానించారు కంగనా రనౌత్.
Recommended Video
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications