హైకోర్టు ఆర్డర్ తో ఊపిరిపీల్చుకున్న ఫేమస్ నటుడు, అధికారంలో ప్రతిపక్షం, పులి !
బెంగళూరు: కర్ణాటకలో పులి గోళ్ల లాకెట్ లు ధరించిన వారిపై అటవీశాఖ అధికారులు యుద్ధాని దిగారు. ఇదే అంశంపై బీజేపీ ఎంపీ, ప్రముఖ కన్నడ నటుడు జగ్గేష్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు కర్ణాటక హైకోర్టు ఆదేశాలతో హీరో జగ్గేష్ ఊపిరిపీల్చుకున్నాడు. పులి గోళ్ల లాకెట్ విషయంపై గతంలో జగ్గేష్ మాట్లాడిన వీడియో ఆధారంగా అటవీశాఖ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు చేశారు.
పులి గోరు లాకెట్ ను స్వాధీనం చేసుకున్న అటవి శాఖ అధికారులు హీరో జగ్గేష్ కు నోటీసు జారీ చేశారు. జగ్గేష్ ఇంట్లో సోదాలు చేసిన అటవీశాఖ అధికారుల చర్యను ప్రశ్నిస్తూ హీరో జగ్గేఫష్ కర్ణఆటక హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు అటవీ అధికారుల నోటీసును సస్పెండ్ చేస్తూ సోమవారం కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ఇటీవల జగ్గేష్‌ను పులి గోళ్లను ధరించాడన్న ఆరోపణలపై అటవీశాఖ అధికారులు బిగ్ బాస్ షోలోనే కంటెస్టెంట్ వర్తూరు సంతోష్ ను అరెస్టు చెయ్యడం కర్ణాటకలో కలకలం రేపింది. తరువాత పులి గోళ్ల లాకెట్ లు ఉన్న వారి మీద కర్ణాటక అటవి శాఖ అధికారులు పంజా విసిరారు. తన ఇంట్లో సోదాలు చేయడం చట్టవిరుద్ధమని, నోటీసును రద్దు చేయాలని కోరుతూ నటుడు జగ్గేష్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
కర్ణాటక అటవీ శాఖ, పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (ట్రాఫిక్ ఫారెస్ట్ టీమ్), బెంగళూరులోని అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారులను ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా ఉన్నారు. అక్టోబరు 25వ తేదీన కన్నడ హీరో, బీజేపీ రాజ్యసభ ఎంపీ జగ్గేష్‌కు నోటీసులు జారీ చేసిన అటవీశాఖ అధికారులు ఆయన ఇంటి సోదాలు చేసి మీరు పులి గోళ్లను ధరించి ఉన్నారని, దానిపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

కన్నడ సినీనటుడు జగ్గేష్ మల్లేశరంలోని నివాసానికి కర్ణాటక అటవి శాఖ అధికారులు వెళ్లి సోదాలు చేశారు. ఇల్లు మొత్తం గాలించి పులి గోళ్లతో ఆక్రమించింది. అటవీశాఖ అధికారుల తీరును ప్రశ్నిస్తూ జగ్గేష్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. జగ్గేష్ విజ్ఞప్తిని హైకోర్టు మన్నించింది. దీంతో కన్నడ హీరో జగ్గేష్ విషయంలో కర్ణాటక అటవీశాఖ అధికారులు వెనక్కి తగ్గారు.












Click it and Unblock the Notifications