రసవత్తరంగా కర్ణాటక రాజకీయం .. జేడీఎస్‌తో ఆజాద్, గెహ్లాట్ మంతనాలు!

Posted By:
Subscribe to Oneindia Telugu

కర్టాటక అసెంబ్లీ హంగ్ దిశగా ప్రయాణిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు తమ రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుంటూనే జాతీయ స్థాయి నేతలు తమ వ్యూహాలపై కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమ పార్టీ మెజారిటీ సీట్లు సంపాదించుకొనే అవకాశాలు లేకపోవడం వలన కాంగ్రెస్ జాతీయ స్థాయి నేతలు ఆజాద్, గెహ్లాట్ రంగంలోకి దిగారు.

ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారిన జేడీఎస్ పార్టీతో కాంగ్రెస్ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం అనుసరించాల్సిన వ్యూహాలు, సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎజెండాపై చర్చలు జరుపుతున్నారు.

Karnataka Election Results: Congress in talk with JDS

కడపటి వార్తలు అందేసరికి బీజేపీ 94, కాంగ్రెస్, 68, జేడీఎస్ 34 స్థానాల్లో అధిక్యంలో ఉన్నారు. కర్ణాటక అసెంబ్లీలో అత్యధిక స్థానాలు సంపాదించిన ఏకైక పార్టీగా బీజేపీ అవతరించే అవకాశం ఉంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Karnataka Election results are in very interesting. Entire Nation is looking at Karanataka Elections. Election results are in trending stage. BJP, Congress is neck to neck situation. Karanataka leading towards Hung assembly. So JDS party leader Kumaraswamy will become King maker in Karanataka Politics.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X