ప్రాచీన క్రీడల గురించి గాలి జనార్దన్ రెడ్డి ఏం చెప్పారంటే?, చూస్తుండగానే ఇలా అయ్యాయి!
కర్ణాటకలోని కోప్పళ జిల్లాలోని గంగావతిలోని జబ్బలగుడ్డ గ్రామ దేవత దుర్గాదేవి జాతర మహోత్సవంలో మాజీ మంత్రి, మైనింగ్ కింగ్, స్థానిక ఎమ్మెల్యే గాలి జనార్ధన రెడ్డి పాల్గొన్నారు. తుంగభద్ర కాలువ మరమ్మతు పనులు త్వరగా ప్రారంభించి వానాకాలం లోపు అంటే ఇదే ఏడాది మే నెలాఖరులోగా ఆపనులు పూర్తి చేసి రైతులకు సక్రమంగా నీరు అందించే సదుపాయం కల్పించాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఆదేశించారు.
ఎమ్మెల్యే అయిన తర్వాత గంగావతి సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని చెప్పిన స్థానిక ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి స్వయంగా పనులను పరిశీలించారు. ఈ నేపథ్యంలో గంగావతి హిరేజంతకల్ విజయనగర్ కాలువ మరమ్మతు పనులను గాలి జనార్దన్ రెడ్డి పరిశీలించారు. రైతులకు సక్రమంగా నీరు అందించాలనే లక్ష్యంతో గంగావతి హిరేజంతకల్ విజయనగర్ కాలువను స్వయంగా సందర్శించానని ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.

త్వరలో మరమ్మతు పనులు పూర్తి చేసి నీటి సరఫరా కల్పిస్తామని ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. జబ్బలగుడ్డ గ్రామ దేవత దుర్గాదేవి జాత్రా మహోత్సవానికి ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి హాజరు అయిన సమయంలో ఆయన వెంట కేఆర్ పీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ గౌడ్, నాయకులు యమనూరు చౌడికి, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా క్రీడాకారులను ఉద్దేశించి గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడారు. ప్రాచీన క్రీడలు కనుమరుగవుతున్నాయని ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.

గంగావతి జబ్బలగుడ్డ గ్రామంలో మాత్రమే గ్రామ దేవత దుర్గాదేవి జాతర మహోత్సవం సందర్భంగా ఉదయం ప్రాచీన క్రీడల పోటీలు కొనసాగుతున్నాయి. ప్రజలతో పాటు నిలబడి క్రీడలు మొత్తం వీక్షించిన గాలి జనార్ధన్ రెడ్డి తర్వాత గేమ్‌లో గెలుపొందిన పోటీదారులకు షీల్డులు అందించారు. ఎన్నో దశాభ్దాలుగా ఈ ప్రాంతంలో కొనసాగుతున్న ప్రాచీన క్రీడలను ఇలాగే కొనసాగించాలని క్రీడా పోటీల్లో పాల్గొన్న జట్లను ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ప్రోత్సహించారు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications