ఎంపీ సెక్స్ స్యాండల్ కేసులో ట్విస్ట్, ఫేమస్ లాయర్ అరెస్టు, సార్ బీజేపీ లీడర్, ఎందుకంటే ?
హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల పెన్ డ్రైవ్ లీక్ చేశారని, లైంగిక వేధింపులు, కులం పేరుతో దూషించారని నమోదు అయిన కేసులో ప్రముఖ న్యాయవాది, బీజేపీ నాయకుడు దేవరాజ్ గౌడను కర్ణాటకలోని చిత్రదుర్గ పోలీసులు అరెస్టు చేశారు. అయితే సిట్ అధికారులు న్యాయవాది దేవరాజ్ గౌడను కస్టడీలోకి తీసుకుంటుందా, లేదా? అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.
హాసన్ జిల్లా హోలేనరసీపురర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళపై లైంగిక వేధింపులు, కులం పేరుతో ఆమె దూషించి లైంగికంగా హింసించారని న్యాయవాది దేవరాజ్ గౌడ్‌పై కేసు నమోదు అయ్యింది. ఇదే కేసులో చిత్రదుర్గ జిల్లా హిరియూరు పోలీసులు లాయర్ దేవరాజ్ గౌడను అరెస్ట్ చేసి హాసన్‌కు తీసుకొచ్చారు. విచారణ అనంతరం లాయర్ దేవరాజ్ గౌడను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే అవకాశం ఉందని పోలీసుల వర్గాలు తెలిపాయి

హలేనరసీపుర రూరల్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ కార్యాలయంలో దేవరాజ్ గౌడను విచారణ చేశారు. హాసన్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ మహ్మద్ సుజీత నేతృత్వంలో శనివారం ఉదయం నుంచి దేవరాజ్ గౌడ్‌ను విచారిస్తున్నారు. దేవరాజ్ గౌడ్ ఈ రోజు న్యాయమూర్తి ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది. హాసన్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసిన దేవరాజ్ గౌడ్ ను సిట్ కు అప్పగిస్తారా? అనే విషయంలో క్లారిటీ లేకపోయినా ఆ విషయం గురించి జోరుగా చర్చ జరుగుతోంది.
దేవరాజ్‌గౌడ్‌ను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినప్పుడు ఆయన్ను కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరే అవకాశం ఉందని తెలిసింది. హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోలు ఉన్న పెన్ డ్రైవ్‌ను దేవరాజ్‌గౌడ్ విడుదల చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మాజీ కారు డ్రైవర్ దేవరాజ్ గౌడ్‌కు పెన్ డ్రైవ్ ఇచ్చారని తెలిసింది. ఈ నేపథ్యంలో సిట్ ఇప్పటికే ఒకసారి దేవరాజే గౌడను పిలిచి విచారించింది.

లైంగిక వేధింపుల కేసులో ఇప్పుడు అరెస్టు అయిన దేవరాజ్ గౌడను పెన్ డ్రైవ్ వైరల్ కేసులో ప్రశ్నించేందుకు సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది.
విచారణకు హాజరుకావాలని దేవరాజేగౌడకు నోటీసులిచ్చినా ఆయన హాజరుకాని పక్షంలో అతడిని కస్టడీకి అప్పగించాలని సిట్ కోర్టును కోరే అవకాశం ఉంది. అయితే ఈరోజు కోర్టుకు సెలవు కావడంతో దేవరాజే గౌడను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది.
బాధితురాలి భర్తతో రాజకీయ నేత శివరాంగౌడ్ మాట్లాడిన ఆడియోను దేవరాజ్ గౌడ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ నేపథ్యంలో దేవరాజ్ గౌడ కదలికలపై హలేనరసీపుర పోలీసులు నిఘా పెట్టారు. దేవరాజ్ గౌడ్ అదృశ్యమైనట్లు మీడియాలో వార్తలు వచ్చిన వెంటనే తాను ఎక్కడికీ వెళ్లలేదని ఇంట్లోనే ఉన్నానని దేవరాజ్ గౌడ వీడియోను అప్‌లోడ్ చేసి పోలీసులను తప్పుదోవ పట్టించాడు.












Click it and Unblock the Notifications