లేడీ టీచర్ మీద అత్యాచారం చేసి ఆరుసార్లు గర్బవతిని చేసిన మత గురువు, తండ్రి ఫ్రెండ్ !

అత్యాచారం కేసుకు సంబంధించి మధ్యప్రదేశ్‌లో తలదాచుకున్న దేశంలోని ప్రముఖ మత గురువును కర్ణాటకలోని హుబ్బళి పోలీసులు అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో జిలానీ అజాహరి అలియాస్ జిలానీ అనే మత గురువును అరెస్టు చేసి హుబ్బళికి తీసుకువచ్చారు. హుబ్బళిలో నివాసం ఉండే మహిళ మీద మత గురువు జిలానీ అత్యాచారం చేశాడని ఆరోపణలు ఉన్నాయి.

హుబ్బళి పోలీసులు అరెస్టు చేసిన మత గురువు గులాం జిలానీ అజాహరి ఆయన మదర్సాలో టీచర్‌గా పనిచేస్తున్న హుబ్బళికి చెందిన యువతికి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. పెళ్లి చేసుకుంటానని చెప్పి రెండేళ్లుగా తనపై అత్యాచారం చేశాడని యువతి హుబ్బళి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గులాం జిలానీ అజాహరి అనే మత గురువు రెండేళ్ల వ్యవధిలో తనకు నాలుగుసార్లు అబార్షన్ చేయించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Karnatakas Hubbali police arrest religious teacher for raping madrasa lady teacher

మళ్లీ ఐదోసారి గర్భం దాల్చిన తర్వాత మత గురువు గులాం జిలానీ బాధితురాలిని పిలుచుకుని వచ్చి హుబ్బళిలోని ఆమె ఇంటిలో వదిలిపెట్టాడు, నాకు, నీకు మధ్య ఎటువంటి సంబంధం లేదని, ఈ విషయం బయటపెడితే నిన్ను, నీ కుటుంబాన్ని చంపేస్తానని మత గురువు గులాం జిలానీ తనను బెదిరించాడని యువతి హుబ్బళి పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం యువతి 6 నెలల గర్భిణి అని పోలీసు అధికారులు తెలిపారు.

హుబ్బళికి చెందిన 23 ఏళ్ల యువతి అలీం కోర్సు పూర్తి చేసి మధ్యప్రదేశ్‌లోని ఖాండవాలోని మత గురువు గులాం జిలానీ మదర్సాలో టీచర్‌గా ఉద్యోగంలో చేరిందని పోలీసులు తెలిపారు. అంతకు ముందు హుబ్బళ్లిలో నివాసం ఉండే యువతి తండ్రికి పరిచయం ఉన్న మత గురువు గులాం జిలానీ అజహరి మీ కూతురికి ఉద్యోగం ఇస్తానని చెప్పడంతో ఆ యువతి ఖాండవా పట్టణానికి వెళ్లిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

మదర్సాలో టీచర్ గా ఉద్యోగం చేస్తున్న యువతి అందం చూసి ఆమెకు వలవేసిన మత గురువు గులాం జిలానీ అజాహరి తన మొదటి భార్య నుంచి తాను విడాకులు తీసుకున్నానని, నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నాపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు నమోదు చేసిన హుబ్బళి ఓల్డ్ పోలీస్ స్టేషన్ పోలీసులు మధ్యప్రదేశ్ వెళ్లి నిందితుడు గులాం జిలానీ అజహరిని అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా నుంచి హుబ్బళికి తీసుకువచ్చి నిందితుడిని విచారణ చెయ్యడానికి పోలీసు అధికారులు సిద్దం అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+