ప్రధాన పార్టీల అడ్రస్ గల్లంతు - పంజాబ్ లో ఆప్ ఏకపక్షంగా : వెనుకంజలో సీఎం - సిద్దూ..!!
పంజాబ్ లో అనూహ్యం. అధికార కాంగ్రెస్ కు ఘోర పరాభవం. ఊహించని విధంగా పరాజయం. అంచనాలకు మించి ఆప్ ప్రభంజనం. పంజాబ్ ఎన్నికల్లో ఆప్ ప్రభుత్వం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసాయి. అన్ని సంస్థలు ఆప్ కు 60 -70 సీట్ల వరకు వస్తాయని లెక్కలు కట్టాయి. కానీ, అంతకు మించి ఆప్ తన సామర్ధ్యం చాటుకుంది. హేమా హేమీలను మట్టి కరిపించింది. ఊహించిన ప్రజా మద్దతు కూడగట్టు కొని అది పెద్ద పార్టీగా..అత్యంత మెజార్టీ సీట్లతో పగ్గాలు చేపడుతోంది. 2017 ఎన్నికల్లో ఆప్ కేవలం 20 సీట్లకే పరిమితం అయింది.
Recommended Video

ఏకపక్షంగా ప్రజా మద్దతుతో
ఆ సమయంలో అమరీందర్ సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ 77 స్థానాల్లో గెలిచి అధికారం దక్కించుకుంది. కానీ, ఈ సారి మాత్రం ఆప్ ముందుగానే పంజాబ్ ఎన్నికల పైన ఫోకస్ చేసింది. అందులో భాగంగా.. వ్యూహాత్మకంగా యువత..మహిళలను తమ వైపు తిప్పుకొనే ఎత్తుగడలను మొదలు పెట్టింది. కాంగ్రెస్ లో సిద్దూ ఎంట్రీ తరువాత మారిన పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకుంది. రైతు ఉద్యమంతో అక్కడ బీజేపీతో పాటుగా ప్రతిపక్షంగా వ్యవహరించిన శిరోమణి అకాళీ దళ్ పైన ప్రభావం చూపింది.

కాంగ్రెస్ కు ఊహించని పరాభవం
అత్యంత భారీ కేడర్ ఉన్న శిరోమణీ అకాళీదల్ సైతం ఆప్ దెబ్బకు కకలావికలం అయింది. చివరకు సీఎంగా ఉన్న చన్నీ పోటీ చేస్తున్న రెండు స్థానాల్లోనూ వెనుకబడి ఉన్నారు. అమృత్సర్ తూర్పు స్థానంలో సైతం వెనుకబడి ఉన్నారు. అమరీందర్ పార్టీని వీడిన ప్రభావం కాంగ్రెస్ పైన పడింది. సిద్దూ రాజేసిన అసమ్మతి రాజకీయం మొత్తంగా కాంగ్రెస్ ను పంజాబ్ లో దెబ్బ తీసింది. మెజార్టీకి కావాల్సిన దాని కంటే భారీ స్థాయిలో సీట్లు సాధిస్తోంది. ఇప్పటికే 89 సీట్లలో ఆధిక్యతలో ఉంది.

అందరి అంచనాలను తల కిందులు చేస్తూ
కాంగ్రెస్ కేవలం 13 స్థానాల్లో మెజార్టీలో కొనసాగుతుండగా.. శిరోమణి అకాలీదళం 9 స్థానాలకే పరిమితం అయింది. ఇక, బీజేపి 5 స్థానాల్లో..ఇతరులు ఒక్క స్థానంలో లీడ్ లో ఉన్నారు. అయితే, ఆప్ గెలుస్తుందని పోలింగ్ తరువాత కాంగ్రెస్ నేతలు సైతం అంచనా వేసినా..మరీ ఇంతలా తమ పరిస్థితి దిగజారుతుందని మాత్రం అంచనా వేయలేకపోయింది. ఇక, ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫలితాలు వెల్లడయిన తరువాత అనూహ్య రాజకీయ సమీకరణాలకు తెర లేచే అవకాశం కనిపిస్తోంది.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications