viral video:కలెక్టరమ్మా చిందులు, స్టూడెంట్స్‌తో కలిసి ఉత్సాహంగా స్టెప్పులు.. ఎక్కడ అంటే..?
అధికారి అంటే హోదా, దర్పం మాములే.. ఇక జిల్లా కలెక్టర్ అంటే తీరిక ఉండదు. ప్రభుత్వ ప్రాధామ్యాలు నెరవేర్చడంలో వారు బిజీ. అవును ఇప్పుడు ఏ రాష్ట్రంలో అయినా అదే సిచుయేషన్.. పని ఒత్తిడి మాత్రం ఎక్కువగానే ఉంటుంది. అప్పుడప్పుడు వారు మానసిక ప్రశాంతత కోసం పాటలు పాడటం, డ్యాన్సు వేయడం మంచిదే. కానీ తీరిక ఉండదు. మరీ స్కూల్, కాలేజీ సెలబ్రేషన్స్‌కు వెళ్లిన సమయంలో అవకాశం ఉంటుంది. దానిని కేరళ కలెక్టర్ యూజ్ చేసుకున్నారు. పిల్లలతో కలిసి ఉత్సాహంగా కాలు కదిపారు. దానిని కొందరు వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది.

కలెక్టర్ దివ్య చిందులు
కేరళలో గల పతనంమిట్టకు చెందిన జిల్లా కలెక్టర్ డాక్టర్ దివ్య ఎస్ అయ్యర్.. మంచి సింగర్, డ్యాన్సర్ కూడా.. ఎప్పుడో చిన్నప్పుడు చేసిన ఆ కళను మరోసారి వెలుగులోకి తీసుకొచ్చారు. ఇటీవల జిల్లా స్టేడియంలో మహ్మాత్మాగాంధీ యూనివర్సిటీ యూనియన్ ఆర్ట్స్ ఫెస్టివల్ ప్రిపరేషన్స్ జరిగాయి. అక్కడ విద్యార్థులు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. కాథొలికేట్ కాలేజ్ స్టూడెంట్స్ డ్యాన్స్ చేస్తున్నారు. అదీ ఆమెకు తెగ నచ్చేసింది. ఇంకేముంది వారితో చేరారు. విద్యార్థులతో కలిసి సమానంగా చిందులేశారు.
దీపికా సాంగ్‌కు స్టెప్పులు
దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ మూవీ గొలియోన్ కీ రాసలీల రామ్ లీలా నుంచి నాగద సాంగ్ ధాల్ పాటకు విద్యార్తులు డ్యాన్స్ వేస్తున్నారు. వారితో ఆమె కాలు కదిపారు. ఆమె విద్యార్థులతో సమానంగా డ్యాన్స్ చేశారు. వారు ఏ స్టెప్ వేసినా.. ఆ విధంగా చేశారు. కలెక్టరమ్మా చిందులు వేసే సమయంలో.. ఆమె కూతురు, కుటుంబ సభ్యులు ఉన్నారు. తనకు పాటలు పాడటం అన్న.. డ్యాన్స్ చేయడం అన్న ఇష్టం అని కలెక్టర్ తర్వాత విద్యార్థులతో తెలిపారు. స్టూడెంట్స్‌ను చూసి ముచ్చట వేసిందని.. అడగగానే డ్యాన్స్ చేశానని తెలిపారు.

స్టూడెంట్స్ ఎనర్జీ సూపర్
స్టూడెంట్స్ చాలా చక్కగా డ్యాన్స్ చేశారని కలెక్టర్ ది్య పేర్కొన్నారు. వారి ఎనర్జీ చూసి ముచ్చట వేసిందని తెలిపింది. తాను విద్యార్థిగా ఉన్న సమయంలో కూచిపూడి, ఒడిస్సి, కథకళి, క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నానని తెలియజేసింది. నిజమే.. ఓ కలెక్టర్ విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేయడం.. వారు ఎంకరేజ్ చేయడం బాగుంది. ఆ వీడియోకు నెటిజన్లు కూడా ఫిదా అయ్యారు. కలెక్టరమ్యా యూవర్ గ్రేట్ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications