రామ్‌దేవ్ బాబాపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ.. అస్సలు కారణం ఇదే!
యోగా గురువు , పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకుడు రాందేవ్ బాబా, సంస్థ ఎండి ఆచార్య బాలకృష్ణకు కేరళ హైకోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కేరళ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ దాఖలు చేసిన కేసులో, దివ్య ఫార్మసీ పతంజలి ఉత్పత్తులు అధిక రక్తపోటు , మధుమేహాన్ని నయం చేస్తాయని తప్పుడు ప్రకటనలు చేస్తోందని ఆరోపించారు. ఇది డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ (అభ్యంతరకరమైన ప్రకటనలు) చట్టం, 1954ను ఉల్లంఘిస్తోంది. దీనిపై కేరళలోని పాలక్కడ్ జిల్లా కోర్టు విచారణ చేపట్టింది.
ఈ విచారణలో భాగంగా కోర్టు ఇంతకు ముందు బెయిలబుల్ వారెంట్ జారీ చేసినప్పటికీ, వారు ఫిబ్రవరి 1 కోర్టుకు హాజరు కాలేకపోవడంతో నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయబడింది . పతంజలి ఉత్పత్తులు అద్భుతమైన ప్రయోజనాలను కలిగి ఉంటాయని తప్పుదోవ పట్టించే ప్రకటనల ద్వారా ఔషధ ప్రకటన చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పతంజలికి చెందిన 10 దివ్య ఫార్మసీ ఉత్పత్తుల తయారీ లైసెన్స్ రద్దయింది. దీనిపై ఫిబ్రవరి 15న తిరిగి విచారణ చేపట్టనున్నట్లు పేర్కొంది.

యోగా గురువు రామ్‌దేవ్‌ను గతంలో జనవరి 16న కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేయగా ఆయన హాజరు కాలేదు. ఆ తర్వాత కోర్టు అదే రోజు బెయిలబుల్ వారెంట్ జారీ చేసి, బెయిల్ కోసం ఫిబ్రవరి 1న స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది. అటు కోజికోడ్ , హరిద్వార్ (ఉత్తరాఖండ్) లలో ఇలాంటి కేసులు కొనసాగుతున్నాయని, అనేక సమన్లు జారీ చేశారు, అయితే రామ్‌దేవ్, బాలకృష్ణ ఏ కేసులోనూ కోర్టుకు హాజరు కాలేదని సమాచారం. ఈ నేపథ్యంలో రాందేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణకు కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications