వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళలో కాస్త తగ్గిన కరోనా.. 15 వేల కేసులు, 92 మంది మృతి

|
Google Oneindia TeluguNews

కేరళలో కరోనా ఉధృతి తగ్గుతోంది. 20 వేల వరకు ఉండే కేసులు అప్పుడప్పుడు 15 వేల కేసులు వస్తున్నాయి. గ‌త కొంత‌కాలంగా 15 వేల నుంచి 35 వేల మ‌ధ్య‌ కొత్త కేసులు వస్తున్నాయి. ఇవాళ కేర‌ళ‌లో కొత్త‌గా 15,692 మందికి పాజిటివ్ వ‌చ్చాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 45,24,185కు పెరిగింది. ఇవాళ కొత్త‌గా 92 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోవ‌డంతో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 23,683కు చేరింది. ఇవాళ 22,223 మంది రిక‌వ‌రీ అయ్యారు. దాంతో మొత్తం రిక‌వ‌రీల సంఖ్య 43,32,897కు పెరిగింది. క‌రోనా మ‌ర‌ణాలు, రిక‌వ‌రీలు పోను ప్ర‌స్తుతం కేర‌ళ‌లో 1,67,008 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేర‌ళ‌లో 14 రాష్ట్రాల్లో మ‌హ‌మ్మారి తీవ్ర ప్ర‌భావం చూపుతుంది.

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

Kerala logs 15,692 new COVID cases, 92 deaths

వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు.

ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు థర్డ్ వేవ్ అని నిపుణులు చెప్పడంతో భయాందోళన నెలకొంది.

English summary
Kerala recorded 15,692 new Covid-19 cases on Monday, informed health department in a press release. With 92 new fatalities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X