దేశంలోనే 4 అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లు కలిగిన రాష్ట్రం ఏదో తెలుసా..?
దేశంలో వైమానిక రంగం క్రమంగా విస్తరిస్తోంది. దేశంలోని ప్రముఖ పట్టణాల నుంచి ప్రపంచ దేశాలకు వారధిగా విమానాశ్రయాలు నిలుస్తున్నాయి. ప్రయాణికుల నుంచి డిమాండ్ కూడా అమాంతం పెరిగిపోయింది. దేశంలోని అనేక రాష్ట్రాలు టూరిజం, వ్యాపారం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అనుగుణంగా ఒకటికి మించి ఎయిర్ పోర్ట్ లను నిర్మిస్తున్నాయి. అయితే భారత్ లోని ఈ రాష్ట్రం ఇప్పుడు దేశంలోనే 4 అంతర్జాతీయ ఎయిర్ పోర్టులు కలిగిన తొలి రాష్ట్రంగా నిలిచింది. ఈ రాష్ట్రం నుంచి ప్రపంచ దేశాలను విమాన సదుపాయం ఉంది.
కేరళ రాష్ట్రం అరుదైన రికార్డును నమోదు చేసింది. దేశంలోనే నాలుగు అంతర్జాతీయ ఎయిర్ పోర్టులు కలిగిన తొలి రాష్ట్రంగా నిలిచింది. కేరళలోని తిరువనంతపురం, కొచ్చి, కోజికోడ్, కన్నూర్ లో అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. చిన్న రాష్ట్రమైన కేరళలో నాలుగు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులు కలిగి ఉండటం విశేషంగా పరిగణిస్తున్నారు. ఈ విమానాశ్రయాల వల్ల కేరళలో టూరిస్టులు, ట్రావెలర్స్ సంఖ్య పెరిగినట్లుగా తెలుస్తోంది. అంతేకాక గాడ్స్ ఓన్ కంట్రీగా పేరుగాంచిన కేరళలో పర్యాటక రంగం క్రమంగా విస్తరిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. విదేశీ పర్యటకుల కారణంగా కేరళ వ్యాపార, వాణిజ్యం అలాగే ఉపాధి రంగంలోనూ గణనీయమైన వృద్ధి సాధించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం దేశంలో ఏ రాష్ట్రానికి లేనంతగా నాలుగు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులు కలిగిన రాష్ట్రంగా కేరళ నిలిచింది. తిరువనంతపురం, కొచ్చి, కోజికోడ్, కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల ద్వారా ట్రావెలింగ్, టూరిజం, వ్యాపారంలో పెరుగుదల కనిపించింది. ఇక త్రివేడ్రం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును 1932 లో నిర్మించారు. ఈ ఎయిర్ పోర్టు కేరళ రాజధానిలో ఉంది. ఈ ఎయిర్ పోర్ట్ కు దగ్గరలో కోవలం, వర్గలా, పూవార్ తదితర టూరిస్టు ప్రాంతాలు ఉన్నాయి. అలాగే కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు 1999 లో నిర్మించారు. ఇది ప్రస్తుతం కేరళలో అత్యంత రద్దీ విమానాశ్రయంగా ఉంది. ఆ తర్వాత కోజికోడ్ లో కాలికట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఉంది. నార్త్ మలాబర్ రీజియన్ కు ఇది సేవలు అందిస్తోంది.

కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ను 2018లో ప్రారంభించారు. కేరళలో నూతనంగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం ఇదే. ఈ ఎయిర్ పోర్టు కన్నూర్, కసర్ గోడ్, వయనాడ్ ప్రాంతాలకు సేవలనందిస్తోంది.












Click it and Unblock the Notifications