Khiladi lady: రూ. లక్షల విలువైన నగలు నొక్కేసిన నర్సు, నమ్మకంగా ఉంటూ ఇంటి యజమానికి !

బెంగళూరు: అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను చూసుకోవడం భర్తకు ఇబ్బంది ఎదురైయ్యింది. శ్రీమంతుడు అయిన భర్త అతని భార్యను చూసుకోవడానికి మంచి నర్సు కావాలని ఓ ఏజెన్సీ సంస్థను ఆశ్రయించాడు. ఏజెన్సీ ద్వారా పరిచయం అయిన నర్సు కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు తోడుగా ఉంటూ ఆమె ఆలనాపాలనా చూసుకుంటున్నది. పని చేస్తున్న ఇంట్లో బంగారు నగలు, నగదు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటూ ఆ నర్సు పసిగట్టింది. అంతే అర్దరాత్రి దంపతులు నిద్రపోతున్న సమయంలో లక్షల రూపాయల విలువైన బంగారు నగలు కొట్టేసింది. మా అమ్మకు అనారోగ్యంగా ఉందని ఇంటి యజమాని దగ్గర మళ్లీ డబ్బులు ఇప్పించుకున్న కిలాడీ నర్సు బంగారు నగలతో పారిపోవడం కలకలం రేపింది.

 భార్యకు అనారోగ్యం

భార్యకు అనారోగ్యం

బెంగళూరులోని అమృతహళ్ళిలోని వెంకట్ లేఔట్ లో రాజేష్ (పేరు మార్చడం జరిగింది) అనే ఆయన నివాసం ఉంటున్నాడు. శ్రీమంతుడైన రాజేష్ భార్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను చూసుకోవడం రాజేష్ కు ఇబ్బంది ఎదురైయ్యింది.

 నర్సు ఎంట్రీ

నర్సు ఎంట్రీ

శ్రీమంతుడు అయిన రాజేష్ అతని భార్యను చూసుకోవడానికి మంచి నర్సు కావాలని డినోవా అనే ఏజెన్సీ సంస్థను ఆశ్రయించాడు. ఏజెన్సీ ద్వారా పరిచయం అయిన నర్సు పవిత్ర కొన్ని రోజుల నుంచి రాజేష్ ఇంటిలో ఉంటూ అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన భార్యకు తోడుగా ఉంటూ ఆమె ఆలనాపాలనా చూసుకుంటున్నది.

 వారం రోజుల్లోనే ?

వారం రోజుల్లోనే ?

వారం రోజుల నుంచి రాజేష్ ఇంటిలో ఉంటున్న నర్సు పవిత్ర ఆమె పని చేస్తున్న ఇంట్లో బంగారు నగలు, నగదు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటూ మొత్తం పసిగట్టింది. రాజేష్ తో, ఆయన భార్యతో నర్సు చాలా నమ్మకంగా ఉంది. అయితే అన్నం పెడుతున్న ఇంటిలనే కన్నం వెయ్యాలని కిలాడీ లేడీ నర్సు మూడు రోజుల నుంచి స్కెచ్ వేసింది.

 అర్దరాత్రి నగలు నొక్కేసిన కిలాడీ నర్సు ఎస్కేప్

అర్దరాత్రి నగలు నొక్కేసిన కిలాడీ నర్సు ఎస్కేప్

అర్దరాత్రి రాజేష్ దంపతులు బెడ్ రూమ్ లో నిద్రపోతున్న సమయంలో మరో రూమ్ లో నిద్రపోతున్నట్లు నటించిన నర్సు పవిత్ర కబోడ్ లో ఉన్న రూ. 4.50 లక్షల రూపాయల విలువైన బంగారు నగలు కొట్టేసింది. మా అమ్మకు అనారోగ్యంగా ఉందని ఇంటి యజమాని రాజేష్ కు చెప్పిన పవిత్ర ఆయన మళ్లీ డబ్బులు ఇప్పించుకుని పారిపోయింది. మరుసటి రోజు ఇంట్లో బంగారు నగలు చోరీ అయ్యాయని తెలుసుకున్న ఇంటి యజమాని కిలాడీ నర్సు పవిత్ర మీద అమృతహళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. బంగారు నగలతో పారిపోయిన కిలాడీ నర్సు పవిత్రను పట్టుకున్న పోలీసులు ఆమెను విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+