Khiladi lady: నర్సింగ్ సెంటర్ ను రొమాన్స్ సెంటర్ చేసింది, రూ. లక్షల్లో సంపాదన, ఉద్యోగం కాదు !
బెంగళూరు: డబ్బు సంపాధించడానికి సవాలక్ష మార్గాలు ఉంటాయి. అయితే కొందరు మాత్రం రాంగ్ రూట్ లో వెలుతున్నారు. మంచి ఉద్యోగం చెయ్యాలని అనుకుంటున్న యువతి, యువకులు వారి కుటుంబ సభ్యులను వదిలేసి సిటీలకు చేరుకుని ఉద్యోగం చేసి డబ్బులు సంపాధించాలని అనుకుంటున్నారు. అమాయకులైన యువతులను ఓ మహిళ నర్సింగ్ సెంటర్ పేరుతో పరిచయం చేసుకుని వారికి దగ్గర అయ్యింది. ఇతర రాష్ట్రాల నుంచి ఐటీహబ్ చేరుకున్న అమ్మాయిలకు మాయమాటలు చెప్పిన కిలాడీ లేడీ లక్షల్లో డబ్బులు సంపాధించడం మొదలుపెట్టింది. వెనక్కి వెళ్లలేక, ముందుకు వెళ్లలేక ఆ అమ్మాయిలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఐటీ హబ్ బెంగళూరు ఫేమస్
కర్ణాటక రాజధాని, ఐటీహబ్ బెంగళూరు చేరుకుంటే ఏదో ఒక ఉద్యోగం చేసి డబ్బులు సంపాధించడానికి అవకాశం ఉంటుందని అందరూ అనుకుంటారు. బెంగళూరులో దేశ విదేశాలకు చెందిన అనేక మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లు చిన్నచిన్న ఉద్యోగాలతో పాటు కార్మికులుగా పని చేస్తున్నారు.

కిలాడీ లేడీ నర్సింగ్ సెంటర్
బెంగళూరు నగరంలోని సంజయ్ నగర్ లో నివాసం ఉంటున్న అర్చనా అలియాస్ అచ్చు (37) అనే మహిళ సంజయ్ నగర్ లో సిబికా ఆయు సెంటర్ అనే నర్సింగ్ సెంటర్ ప్రారంభించింది. ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగం చెయ్యాలని బెంగళూరు వచ్చిన అందమైన యువతులను అర్చనా అండ్ కో పరిచయం చేసుకున్నారు.

అమ్మాయిలకు మాయమాటలు
దావణగెరె జిల్లాకు చెందిన రాఘవేంద్ర, తుమకూరుకు చెందిన మంజునాథ్ అనే యువకుల సహాయంతో అర్చనా అనేక మంది అమాయకులైన అమ్మాయిలను పరిచయం చేసుకుంది. మీకు ఉద్యోగాలు రావడం ఆలస్యం అవుతుందని, నేను చెప్పినట్లు చేస్తే మీరు వేలల్లో డబ్బులు సంపాధించవచ్చని అర్చనా నిరుద్యోగులకు మాయమాటలు చెప్పింది.

హైటెక్ వ్యభిచారం చేయించి రూ. లక్షల్లో ?
ఇతర రాష్ట్రాల నుంచి ఐటీహబ్ చేరుకుని ఉద్యోగాలు చెయ్యాలని అనుకున్న అమ్మాయిలకు మాయమాటలు చెప్పిన కిలాడీ లేడీ అర్చనా వారితో హైటెక్ వ్యభిచారం చేయించి వాళ్లుకు కొంత డబ్బులు ఇచ్చి ఆమె మాత్రం రూ. లక్షల్లో డబ్బులు సంపాధించడం మొదలుపెట్టింది. వ్యభిచార కూపంలో కూరుకుపోయిన అమ్మాయిలు సొంత ఊర్లకు వెళ్లలేక, ఇక్కడ వ్యభిచారం చెయ్యలేక నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

లాడ్జ్ లో మ్యాటర్ లీక్ అయ్యింది
ఇటీవల బెంగళూరులో లాడ్జ్ ల్లో జరిగిన రైడ్స్ లో పోలీసులకు సంజయ్ నగర్ అర్చనా మ్యాటర్ తెలిసింది. పక్లాప్లాన్ తో నర్సింగ్ సెంటర్ మీద దాడి చేసిన పోలీసులు అర్చనాతో పాటు మంజునాథ్ రాఘవేంద్రలను అరెస్టు చేసి కొందరు అమ్మాయిలను వ్యభిచార కూపం నుంచి రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications