తమిళనాడు ఎన్నికల పోరు .. ప్రచారంలో పక్కనే ఉన్న సొంత పార్టీ నేతపై నిప్పులు చెరిగిన ఖుష్బూ సుందర్

తమిళనాడులో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకరిని మించి ఒకరు మాటల తూటాలను పేలుస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు . హేమాహేమీలు బరిలోకి దిగిన తమిళనాడు ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతుంది. కమల్ హాసన్, గౌతమి, కుష్బూ సుందర్ వంటి స్టార్ సెలబ్రెటీలు తమ ఎన్నికల రాజకీయాలలో ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.

 పక్కనే ఉన్న సొంత పార్టీ నేతపై ఎన్నికల ప్రచారంలో ఖుష్బూ విమర్శలు

పక్కనే ఉన్న సొంత పార్టీ నేతపై ఎన్నికల ప్రచారంలో ఖుష్బూ విమర్శలు

తాజాగా కాంగ్రెస్ నుండి బీజేపీ లోకి వచ్చి తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన సినీనటి కుష్బూ సుందర్ థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుండి ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. తాను పోటీ చేసిన నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొన్న ఖుష్బూ సుందర్ ఊహించని విధంగా సొంత పార్టీ నేత పై నిప్పులు చెరిగారు. దీంతో ఖుష్బూ చేసిన వ్యాఖ్యలను విన్న జనాలు నవ్వుకో గా, పక్కనే ఉన్న సదరు నాయకుడు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.

 నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేపై నిప్పులు చెరిగిన ఖుష్బూ .. నవ్వుకున్న జనాలు

నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేపై నిప్పులు చెరిగిన ఖుష్బూ .. నవ్వుకున్న జనాలు

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఖుష్బూ, గత ఎమ్మెల్యే ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని, నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి గత ఎమ్మెల్యే ఏ మాత్రం కృషి చేయలేదని, సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సొంత పార్టీ నేత పై ఖుష్బూ చేసిన వ్యాఖ్యలకు జన నవ్వుతూ కేకలు వేశారు. ఖుష్బూ పక్కనే ఉన్న థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన కేకే సెల్వం తీవ్రంగా ఇబ్బంది ఇబ్బంది పడ్డారు.

ఆమె పక్కనే ఉండి ఇబ్బంది పడిన నేత .. విషయం తెలిసే సరికే అంతా సమాప్తం

ఆమె పక్కనే ఉండి ఇబ్బంది పడిన నేత .. విషయం తెలిసే సరికే అంతా సమాప్తం


జనాల ఉత్సాహం చూసి మరింత రెచ్చిపోయి సొంత పార్టీ నేతను చెడుగుడు ఆడేసిన ఖుష్బూ, ఆమె వెనుక ఉన్న ఓ నేత మేడం.. ఆ మాజీ ఎమ్మెల్యే సెల్వం మీ పక్కన ఉన్న ఆయనే అని చెప్పడంతో ఒక్కసారిగా ఖుష్బూ నాలుక కరుచుకున్నారు . అయితే గతంలో డీఎంకె పార్టీ నుండి థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుండి కేకే సెల్వం గెలుపొందారు . ఆ తర్వాత ఆయన ఇటీవల బిజెపిలో చేరారు. ఇక ఆ విషయం గుర్తించని ఖుష్బూ డీఎంకే ఎమ్మెల్యే అన్న పేరుతో విమర్శల వర్షం కురిపించారు. తాను విమర్శలు చేసిన నేత పక్కనున్న సెల్వం అని గ్రహించి ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఇబ్బందికరంగా ప్రచారాన్ని కొనసాగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+