temple: ముగ్గురు మొనగాళ్లు, హిందూ దేవాలయాలు టార్గెట్, గుడి గంటలు మాత్రమే, వామ్మో !
బెంగళూరు/కొడుగు: హిందూ దేవాలయాలను టార్గెట్‌గా చేసుకుని లక్షల రూపాయల విలువైన గుడిలో గంటలను చోరీ చేస్తున్న ముగ్గురు నిందితులను కొడగు పోలీసులు అరెస్ట్ చేశారు. కేవలం గుడిలో గంటలను మాత్రమే టార్గెట్ చేసుకుని గుడి గంటలు చోరీ చేస్తున్న ముగ్గురు నిందితుల స్కెచ్ తెలుసుకున్న పోలీసులు బిత్తరపోయారు.
అమమ్మద్ అమ్జాద్, సమీవుల్లా, జుల్పికర్ అనే నిందితులను అరెస్టు చేశామని పోలీసులు. ముగ్గురు నిందితులు చాలా దగ్గర బంధువులు అని, ముగ్గురు మైసూరులోని వివిద లేఔట్ లలో నివాసం ఉంటున్నారని కొడుకు పోలీసులు తెలిపారు. వివిద దేవాలయాల్లో చోరీ అయిన 800 కిలోల కంచు, రాగి గంటలతో సహా ఖనిజాలతో తయారు చేసిన గుడి గంటలు స్వాధీనం చేసుకున్నామని కర్ణాటకలోని కొడుగు పోలీసులు తెలిపారు.

ఈకేసులో మరో నిందితుడు, నిందితుల బంధువు, గుజరీ వ్యాపారి హైదర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. చోరీ చేసిన గుడి గంటలు అన్ని నిందితులు గుజరీ వ్యాపారి హైదర్ గుజరీ షెడ్ లో దాచిపెట్టారు. గుడి గంటలు మొత్తం కరిగించి గుజరి వ్యాపారి హైదర్ సహాయంతో ఓ ఫ్యాక్టరీలో డీల్ మాట్లాడుకున్నారని కొడుగు పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
నిందితులు గుడిలో గంటలు ఏవిధంగా చోరీ చేశారు అని అసలు మ్యాటర్ తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. మొదట దేవాలయాలకు బైక్‌లపై వెలుతున్న నిందితులు ఇక్కడ దొంగతనాలు చెయ్యడం సాధ్యమా ?, కాదా ? అని ఆరా తీశారు. రెండో సారి కారులో దేవాలయాలకు వెళ్లి మరోసారి పరిశీలిస్తున్నాడు. దేవాలయాల దగ్గర సీసీటీవీ కెమెరాలు ఉంటే కెమెరాల వెనుక నుంచి వెళ్లి వాటిని నిందితుల ముఖాలు కనపడకుండా వాటిని పక్కకు తిప్డానికి ప్రయత్నిస్తారు.
అది సాధ్యం కాకపోతే సీసీటీవీ కెమెరాల వైర్ల కత్తిరించి గుడిలో గంటలు చోరీ చేసి వెలుతున్నారని పోలీసులు అన్నారు. అయితే ఒక్క గుడిలో కూడా గుడి గంట కదిలి సౌండ రాకుండా చూసుకున్నారని పోలీసు అధికారులు అన్నారు. గుడిలో గంటలను మాత్రమే టార్గెట్ చేస్తున్న నిందితులు లక్షల రూపాయల విలువైన గుడి గంటలు చోరీ చేసి చిక్కిపోవడం హాట్ టాపిక్ అయ్యింది.
సులభమా.. లేక ఇబ్బందిగా ఉందా అని ఆలయాల ఆవరణలో తనిఖీలు చేసేవారు. తర్వాత మరో కారులో వస్తుండేవాడు, సీసీటీవీలు ఉంటే సీసీ కెమెరాల వెనుక నుంచి వచ్చి వాటికి చిక్కకుండా దారి మళ్లించేవాడు. సాధ్యం కాకపోతే, వారు వాటిని డిస్‌కనెక్ట్ చేస్తారు. అనంతరం కొడగు ఎస్పీ మాట్లాడుతూ దేవాలయాల్లో గంటలు దొంగిలించేవాడని తెలిపారు. అయ్యప్ప అన్నారు.












Click it and Unblock the Notifications