కొచ్చిలో కిస్ ఆఫ్ లవ్, మోరల్ పోలిసింగ్ కు నిరసన, పినరయి విజయన్ ఇలా...

కేరళళో మరోసారి కిస్ ఆఫ్ లవ్ ఆందోళనకు రంగం సిద్దమైంది. మహిళా దినోత్సవం రోజు కొచ్చిలో చోటుచేసుకొన్న మోరల్ పోలిసింగ్ ఘటనను నిరసిస్తూ కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమం ద్వారా నిరసన చేపట్టనున్నారు.

కొచ్చి:కేరళలో మరోసారి కిస్ ఆఫ్ లవ్ ఆందోళనకు రంగం సిద్దమైంది. మహిళా దినోత్సవం నాడు కొచ్చిలో చోటుచేసుకొన్న మోరల్ పోలీసింగ్ ఘటనకు వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.మోరల్ పోలిసింగ్ ను తీవ్రంగా ఖండించారు ముఖ్యమంత్రి పినరయి విజయన్, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు.

కొచ్చి మెరైన్ డ్రవై్ మైదానంలో గురువారం సాయంత్రం కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమం నిర్వహించనున్నట్టు స్వేచ్చా వాదులు ప్రకటించారు. యువ జంటలపై దాడులకు నిరసనగా ఈ ఆందోళనను చేపట్టనున్నట్టు ప్రకటించారు.

మెరైన్ డ్రైవ్ మైదానానికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కోజికోడ్ లోని ఓ హోటల్ లో భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు చేసిన దాడులకు వ్యతిరేకంగా 2014 లో కిస్ ఆఫ్ లవ్ నిరసనలలు చేపట్టారు.

Kiss of Love returns: Kerala activists to protest against Shiv Sena moral policing

కాగా, కొచ్చి మోరల్ పోలీసింగ్ ఘటనలో కొచ్చి సెంట్రల్ సబ్ ఇన్స్ పెక్టర్ ను సస్పెండ్ చేశారు. ఎనిమిది మంది పోలీసులను ఆర్మ్ రిజర్వ్ పోలీస్ క్యాంపుకు బదిలీ చేశారు. మోరల్ పోలీసింగ్ ఘటనను కొచ్చి మేయర్ సౌమిని జైన్ తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

అయితే మోరల్ పోలిసింగ్ పై కేరళ ముఖ్యమంత్రి విజయన్ తీవ్రంగా స్పందించారు. మోరల్ పోలీసింగ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఆయన చెప్పారు.ఈ ఘటనను అవమానకర ఘటనగా ఆయన చెప్పారు. ఇందుకు భాద్యులైనవారిని కఠినంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+