హగ్ ఆఫ్ లవ్‌పై కొరడా: పది మంది సస్పెన్షన్
కొచ్చి: పోలీసుల మోరల్ పోలిసింగ్‌కు నిరసనగా కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో కిస్ ఆఫ్ లవ్ తర్వాత విద్యార్థులు హగ్ ఆఫ్ లవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పది మంది విద్యార్థులు కళాశాల నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు.
కొఝీకోడ్‌లోని డౌన్‌టౌన్ హోటల్ వద్ద నిర్వహించిన కిస్ ఆఫ్ లవ్‌కు సంఘీభావంగా మహారాజ కళాశాల విద్యార్థులు హగ్ ఆఫ్ లవ్ నిర్వహించారు. నవంబర్ 2వ తేదీన మెరైన్ డ్రైవ్ మైదానంలో కిస్ ఆఫ్ లవ్ నిర్వహించ తలపెట్టిన విషయం తెలిసిందే.

శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కొద్ది మంది విద్యార్థులు కళాశాల వద్ద గుమిగూడి కళాశాల అధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ వినకుండా కౌగిలింతల కార్యక్రమం నిర్వహించారు. హగ్ ఆఫ్ లవ్ కార్యక్రమం నిర్వహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని కళాశాల అధికారులు ముందుగానే హెచ్చరించారు.
ఆ కార్యక్రమ నిర్వహణకు ముందుగా ఏ విధమైన అనుమతి తీసుకోలేదని, అనుమతి లేకుండా ఆ కార్యక్రమం నిర్వహించినందుకు గాను పది మంది విద్యార్థులను పది రోజుల పాటు కళాశాల నుంచి సస్పెండ్ చేశామని కాలేజీ ప్రిన్సిపాల్ టివి ఫ్రాన్సీ చెప్పారు.
మీడియా ప్రచారంతో కిస్ ఆఫ్ లవ్‌కు విపరీతమైన ప్రచారం లభించింది. దాదాపు 30 మందిని పోలీసులు ముందుగానే అరెస్టు చేయడంతో ఆ కార్యక్రమాన్ని నిర్వాహకులు, సానుభూతిపరులు చేపట్టలేకపోయారు.












Click it and Unblock the Notifications