‘‘కృష్ణుడే పెద్ద‘ఈవ్ టీజర్’!‘యాంటీ కృష్ణా స్క్వాడ్స్’అనే దమ్ము యోగికి ఉందా?’’
కృష్ణుడే పెద్ద‘ఈవ్ టీజర్’!‘యాంటీ కృష్ణా స్క్వాడ్స్’అనే దమ్ము యోగికి ఉందా? అంటూ ఆప్ మాజీ నేత, ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషణ్ ట్విట్టర్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ సర్కారు 'యాంటీ రోమియో స్క్వాడ్' ప్రవేశపెట్టడంపై ఆప్ మాజీ నేత, ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
''రోమియో కేవలం ఒక్క అమ్మాయినే ప్రేమించాడు. అసలు శ్రీకృష్ణుడు పేరుమోసిన ఈవ్ టీజర్ (అమ్మాయిలను ఏడిపించేవాడు). ఈ లెక్కన యోగి ఆదిత్యనాథ్‌కు తన యాంటీ రోమియో స్క్వాడ్స్‌ను 'యాంటీ కృష్ణా స్క్వాడ్స్' అనే దమ్ముందా?'' అని ట్విట్టర్ లో ఆయన ప్రశ్నించారు.

స్వరాజ్‌ఇండియా పార్టీలోని తన సహచరుడు అనుపమ్.. ''యాంటీ రోమియో స్క్వాడ్ అనేది షేక్‌స్పియర్‌కు ఇండియా నివాళి. అయితే, ఇందుకు ప్రతిగా ఈవ్‌టీజింగ్‌ను నిరోధించేందుకు ఇంగ్లండ్ 'యాంటీ కృష్ణా స్క్వాడ్'ను పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు'' అంటూ పెట్టిన ట్వీట్‌కు ప్రశాంత భూషణ్ స్పందన ఇది.
ఆయన అంతటితో ఆగలేదు. హిందూ పురాణాల్లో కొందరు దేవుళ్లు 'ఈవ్ టీజర్స్' అయినా కూడా వారిని దేవుళ్లుగా కొలుస్తారన్నారు. దీంతో ఆయనపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.
Anti Romeo Squad: India's tribute to Shakespeare! Won't b surprised if England, to fight eveteasing, forms Anti Krishn Squad in retaliation!
— Anupam (@AnupamConnects) April 1, 2017
My tweet on Romeo brigade being distorted. My position is: By the logic of Romeo Brigade, even Lord Krishna would look like eve teaser.
— Prashant Bhushan (@pbhushan1) April 2, 2017
My tweet on Romeo brigade being distorted. My position is: By the logic of Romeo Brigade, even Lord Krishna would look like eve teaser.
— Prashant Bhushan (@pbhushan1) April 2, 2017
Filing A police complaint today against Prashant Bhushan for insulting Lord Krishna https://t.co/JCCdkpbGsa
— Tajinder Pal S Bagga (@TajinderBagga) April 2, 2017
Romeo loved just one lady,while Krishna was a legendary Eve teaser.Would Adityanath have the guts to call his vigilantes AntiKrishna squads? https://t.co/IYslpP0ECv
— Prashant Bhushan (@pbhushan1) April 2, 2017
వెంటనే ప్రశాంత భూషణ్ తన ట్వీట్‌ను సమర్థించుకుంటూ.. ''రోమియో బ్రిగేడ్ మీద నా ట్వీట్‌ను వక్రీకరించారు. నా ఉద్దేశం ఏంటంటే.. ఏ లాజిక్‌తో అయితే రోమియో బ్రిగేడ్‌ను పెట్టారో, దాని ప్రకారం కృష్ణుడు కూడా ఈవ్ టీజరే అవుతాడు కదా'' అంటూ మరో ట్వీట్ చేశారు.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు!












Click it and Unblock the Notifications