Lady: భర్తతో విడాకులు, పెళ్లి చేసుకుంటానని ఏం చేశాడంటే ?, మెడ మీద కత్తిపెట్టి ఫ్రెండ్స్ తో కలిసి కారులోనే!

బరేలీ/ఉత్తరప్రదేశ్: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో గొడవల కారణంగా విడిపోయింది. భర్తకు దూరంగా ఉంటున్న మహిళ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువకుడు ఆమెకు పరిచయం అయ్యాడు. పెళ్లి చేసుకుంటానని భర్తకు దూరం అయిన మహిళను నమ్మించాడు. మహిళను రహస్య ప్రాంతాలకు పిలుచుకుని వెళ్లిన ప్రియుడు ఆమెతో శారీరక సబంధం పెట్టుకున్నాడు. ఇదే సమయంలో ప్రియుడి స్నేహితులు కూడా నిన్ను పెళ్లి చేసుకుంటాము అంటూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు.

ఒంటరి మహిళ ఏమీ చెయ్యలేక మౌనంగా ఉండిపోయింది. ప్రియుడు ఆమెను నమ్మించి కారులో పిలుచుకుని రహస్య ప్రాంతానికి బయలుదేరాడు. ఆ సందర్బంలో ప్రియుడితో పాటు అతని స్నేహితులు కారులోనే మహిళ మెడ మీద కత్తి పెట్టి చంపేస్తామని బెదిరించి అదే వాహనంలో గ్యాంగ్ రేప్ చెయ్యడం కలకలం రేపింది.

భర్తకు విడాకులు ఇచ్చిన మహిళ

భర్తకు విడాకులు ఇచ్చిన మహిళ

ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లాలోని సుభాష్ నగర్ పట్టణంలో స్వప్నా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ నివాసం ఉంటున్నది. కుటుంబ సభ్యులు చూపించిన పెళ్లి చేసుకున్న స్వప్నా కొన్ని సంవత్సరాలు ఆమె భర్తతో కాపురం చేసింది. భర్తతో గొడవల కారణంగా గత ఏడాది స్వప్నా ఆమె భర్తతో విడిపోయింది.

కంపెనీలో కాలాంతకుడు పరిచయం

కంపెనీలో కాలాంతకుడు పరిచయం

భర్తకు దూరంగా ఉంటున్న స్వప్నా ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అదే కంపెనీలో పని చేస్తున్న తనూజ్ అనే యువకుడు స్వప్నాకు పరిచయం అయ్యాడు. కొంతకాలం స్వప్నాతో తనూజ్ స్నేహంగా ఉన్నట్లు నటించాడు. రానురాను తనూజ్ సాటి ఉద్యోగి స్వప్నాతో చనువు పెంచుకుని ఆమెకు దగ్గర అయ్యాడు.

ప్రేమ, పెళ్లి పేరుతో చీటింగ్

ప్రేమ, పెళ్లి పేరుతో చీటింగ్

నేను నిన్నుపెళ్లి చేసుకుంటానని, నీకు మంచి జీవితాన్ని ఇస్తానని భర్తకు దూరం అయిన స్వప్నాను తనూజ్ అతని మాయమాటలతో నమ్మించాడు. స్వప్నాను రహస్య ప్రాంతాలకు పిలుచుకుని వెళ్లిన ఆమె ప్రియుడు తనూజ్ ఆమెతో శారీరక సబంధం పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతో స్వప్నా కూడా అతన్ని గుడ్డిగా నమ్మింది.

ప్రియుడి ఫ్రెండ్స్ ఎంట్రీ

ప్రియుడి ఫ్రెండ్స్ ఎంట్రీ

భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న స్వప్నాతో తనూజ్ ఎంజాయ్ చేస్తున్న విషయం అతని స్నేహితులకు తెలిసింది. నీతో తిరుగుతున్న తనూజ్ మోసగాడని, అతను నిన్ను మోసం చేస్తాడని ప్రియుడు ఫ్రెండ్స్ స్వప్నాకు చెప్పారు. ఇదే సమయంలో ప్రియుడు తనూజ్ స్నేహితులు కూడా నిన్ను పెళ్లి చేసుకుంటాము అంటూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు.

మెడ మీద కత్తి పెట్టి కారులో గ్యాంగ్ రేప్!

మెడ మీద కత్తి పెట్టి కారులో గ్యాంగ్ రేప్!

ఒంటరిగా ఉంటున్న స్వప్నా ఏమీ చెయ్యలేక తనూజ్, అతని స్నేహితుల ఆగడాలు భరిస్తూ మౌనంగా ఉండిపోయింది. రెండు రోజుల ముందు ప్రియుడు తనూజ్ పక్కాప్లాన్ తో స్వప్నాను నమ్మించి కారులో పిలుచుకుని రహస్య ప్రాంతానికి బయలుదేరాడు. ఆ సందర్బంలో ప్రియుడు తనూజ్ తో పాటు అతని స్నేహితులు కారులోనే స్వప్నా మెడ మీద కత్తి పెట్టి చంపేస్తామని బెదిరించి అదే వాహనంలో గ్యాంగ్ రేప్ చెయ్యడం కలకలం రేపింది.

తప్పించుకుని పారిపోయిన బాధితురాలు

తప్పించుకుని పారిపోయిన బాధితురాలు

బాధితురాలు తప్పించుకుని పారిపోయి తనూజ్ తో పాటు అతని స్నేహితుల మీద కేసు పెట్టిందని బరేలీ జిల్లా ఎస్పీ సీటీ రవీంద్ర కుమార్ మీడియాకు చెప్పారు. మహిళకు వైద్యపరీక్షలు చేయించామని, ఆమె నుంచి స్టేట్ మెంట్ తీసుకుని తనూజ్ తో పాటు అతని స్నేహితు మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని బరేలీ జిల్లా ఎస్పీ సీటీ రవీంద్ర కుమార్ మీడియాకు చెప్పారు.

అయితే పోలీస్ స్టేషన్ కు చేరుకున్న కామాంధులు తనూజ్ అతని ఫ్రెండ్స్ బాధితురాలికి కొంత డబ్బులు ఇచ్చి రాజీ చేసుకోవడానికి ప్రయత్నించారని స్థానిక మీడియా తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+