Lady leader: పొలిటికల్ గేమ్, పుష్పా ఆత్మహత్యాయత్నం, ఐసీయూలో ?, లెటర్ లో పేర్లు రాసి !
బెంగళూరు/కోలారు: రాజకీయాల్లోకి వచ్చిన పుష్పా శక్తి వంచన లేకుండా ప్రజా సేవ చెయ్యడానికి సిద్దం అయ్యాయింది. ఎన్నికలు లేని సమయంలో కూడా ఆమె ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నించింది. ప్రజల ఆధరాభిమానలు సంపాధించుకున్న లేడీ లీడర్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గ్రామ పంచాయితీ అధ్యక్షురాలిగా విజయం సాధించింది. మహిళా అయినా ప్రజలు సమస్యలు తీర్చడానికి తన వంతు సహకారం అందించింది. అయితే రాజకీయ కుమ్ములాటలో భాగంగా లేడీ టీడర్ కు సాటి రాజకీయ నాయకులు వేధింపులు ఎక్కువ అయ్యాయని సమాచారం. చాలా కాలం ఓపికగా చూసి చూడనట్లు వ్యవహిరించిన లేడీ లీడర్ ఆత్మహత్యాయత్నం చెయ్యడం కలకలం రేపింది. నా ఆత్మహత్యకు వారిద్దరే కారణం అంటూ లేడీ లీడర్ పుష్పా ఓ లెటర్ రాసి పెట్టి ఆత్మహత్యాయత్నం చేసింది. మోతాదుకు మించిన నిద్రమాత్రలు మింగేసిన లేడీ లీడర్ పుష్పా ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతోంది. పుష్పా ఆత్మహత్యాయత్నం చెయ్యడంతో ఆమెను ఇంతకాలం వేధించిన నాయకులు పరారైనారు.

ఆంధ్రా బార్డర్ లో !
కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కోలారు తాలుకాలోని కొండరాజేనహళ్ళిలో పుష్పా అనే మహిళ నివాసం ఉంటున్నది. రాజకీయాల్లోకి వచ్చిన పుష్పా శక్తి వంచన లేకుండా ప్రజాసేవ చెయ్యడానికి సిద్దం అయ్యాయింది. ఎన్నికలు లేని సమయంలో కూడా పుష్పా స్థానిక ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నించింది.

గ్రామ పంచాయితీ అధ్యక్షురాలు
ప్రజల ఆధరాభిమానాలు సంపాధించుకున్న లేడీ లీడర్ పుష్నా ఇటీవల కర్ణాటకలో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసింది. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన పుష్పా కొండరాజేనహళ్ళి గ్రామ పంచాయితీ అధ్యక్షురాలిగా విజయం సాధించింది. గ్రామ పంచాయితీ అధ్యక్షురాలైన తరువాత పుష్పా ప్రజలు సమస్యలు తీర్చడానికి తన వంతు సహకారం అందించింది.

ఉపాధ్యక్షుడితో రామాయణం
కొండరాజేనహళ్ళి గ్రామ పంచాయితీ ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్న నాగేష్, గ్రామ పంచాయితీ సభ్యుడు విజయ్ కుమార్ అదే గ్రామ పంచాయితీ అధ్యక్షురాలు పుష్పా మీద పెత్తనం చెలాయించడానికి ప్రయత్నించారు. అయితే వారి ఆగడాలకు గ్రామ పంచాయితీ అధ్యక్షురాలు పుష్పా అడ్డుకుంటూ వచ్చిందని సమాచారం.

లేటర్ రాసి పెట్టి ఆత్మహత్యాయత్నం
రాజకీయ కుమ్ములాటలో భాగంగా లేడీ టీడర్ పుష్పాకు సాటి రాజకీయ నాయకులు నాగేష్, విజయ్ కుమార్ వేధింపులు ఎక్కువ అయ్యాయని సమాచారం. చాలా కాలం ఓపికగా చూసి చూడనట్లు వ్యవహిరించిన లేడీ లీడర్ పుష్పా ఆమె ఇంట్లో ఆత్మహత్యాయత్నం చెయ్యడం కలకలం రేపింది. నా ఆత్మహత్యకు నాగేష్ విజయ్ కుమార్ కారణం అని లేడీ లీడర్ పుష్పా ఓ లెటర్ రాసి పెట్టి ఆత్మహత్యాయత్నం చేసింది.

తోడు దొంగలు పరుగో పరుగు
మోతాదుకు మించిన నిద్రమాత్రలు మింగేసిన లేడీ లీడర్ పుష్పాను కోలారు పట్టణంలోని జాలప్ప ఆసుపత్రికి తరలించారు. జాలప్ప ఆసుపత్రిలో ఐసీయూలో పుష్పా చికిత్స పొందుతోంది. పుష్పా ఆత్మహత్యాయత్నం చెయ్యడంతో ఆమెను ఇంతకాలం వేధించిన నాయకులు నాగేష్, విజయ్ కుమార్ పరారైనారని కోలారు గ్రామీణ పోలీసులు తెలిపారు. పరారైన ఇద్దరి కోసం కోలారు గ్రామీణ పోలీసులు గాలిస్తున్నారు, లేడీ లీడర్ పుష్పా ఆత్మహత్యాయత్నం చేసి ఆసుపత్రిలో ఐసీయూలో ఉండటంతో ఆమె నివాసం ఉంటున్న గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications