Lady leader: సొంత పార్టీ లీడర్ తో ఢిష్యూం ఢిష్యూం. పదవి దక్కలేదని వాట్సాప్ లో స్టేటస్ పోస్టు చేసి !
బెంగళూరు/ చిక్కమగళూరు: ఆమె ప్రముఖ పార్టీలో మహిళ నాయకురాలిగా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నది. నగర పంచాయితీ అధ్యక్షురాలు కావాలని ఆమె ఆశపడుతోంది. పంచాయితీ సభ్యురాలిగా ఉంటున్న ఆమెకు కార్యకర్తల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. పదవుల పంపకంలో తేడాలు రావడంతో ఒకే పార్టీ నాయకులతో ఆమెకు గొడవలు మొదలైనాయి. చాలా రోజుల నుంచి పార్టీ పెద్దలు ఇద్దరి మద్య రాజీలు చేస్తూనే ఉన్నారు. పట్టణ పంచాయితీ అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తి ఆయన పదవికి రాజీనామా చేసి లేడీ లీడర్ ను ఆ కుర్చీలో కుర్చోపెట్టడానికి ససేమిరా అంటున్నారు. పార్టీ మీటింగ్ లో తనను అనుచితంగా మాట్లాడాడరని ఆమె పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసింది. అయితే పార్టీ పెద్దలు ఏ విషయం తేల్చకపోవడంతో నా ఆత్మహత్యకు ఈ నాయకుడే కారణం అంటూ ఆయన పేరుతో సహ వాట్సాప్ స్టేటస్ లో పోస్టు చేసిన లేడీ లీడర్ ఆత్మహత్యాయత్నం చెయ్యడం కలకలం రేపింది.

లేడీ లీడర్
కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే అనేక జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని మునిసిపాలిటీలు, పంచాయితీల్లో అధికారంలో ఉంది. చిక్కమగళూరు జిల్లాలోని ఎన్ఆర్ పురం తాలుకా పంచాయితీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎన్ఆర్ పుర పంచాయితీ సభ్యురాలిగా జుబేదా ఉన్నారు.

మాస్ లీడర్.... ఫాలోయింగ్ ఎక్కువే
కాంగ్రెస్ పార్టీలో మహిళ నాయకురాలిగా పని చేస్తున్న జుబేదాకు పార్టీ నాయకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నది. తాలుకా పంచాయితీ అధ్యక్షురాలు కావాలని జుబేదా ఆశపడుతోంది. తాలుకా పంచాయితీ అధ్యక్ష పదవిని 50-50 లో భాగం అధికారం పంచుకోవాలని జుబేదా, సూరయ్య బానుల మద్య గతంలోనే రాజీ జరిగింది.

రాజీనామా చెయ్యనని చెప్పిన లీడర్
పంచాయితీ సభ్యురాలిగా ఉంటున్న జుబేదాకు కార్యకర్తల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. పదవుల పంపకంలో తేడాలు రావడంతో ఒకే పార్టీ నాయకుడు సూరయ్య బానుతో ఆమెకు గొడవలు మొదలైనాయి. ప్రస్తుతం తాలుకా పంచాయితీ అధ్యక్షుడిగా ఉన్న సూరయ్య బాను తాను రాజీనామా చెయ్యనని, మహిళ కింద తాను పని చెయ్యలేనని మొండికి వేశాడని సమాచారం.

పెద్దలు రాజీ చేస్తామని చెప్పినా ?
చాలా రోజుల నుంచి పార్టీ పెద్దలు సూరయ్య బాను, జుబేదాల మద్య రాజీలు చేస్తూనే ఉన్నారు. పంచాయితీ అధ్యక్ష పదవిలో ఉన్న సూరయ్య బాను ఆయన పదవికి రాజీనామా చేసి లేడీ లీడర్ జుబేదాను ఆ కుర్చీలో కుర్చోపెట్టడానికి ససేమిరా అంటున్నారు. పార్టీ మీటింగ్ లో సూరయ్య బాను తనను అనుచితంగా మాట్లాడాడరని జుబేదా ఇప్పటికే కర్ణాటక కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసింది.

లేడీ లీడర్ ఆత్మహత్యాయత్నం...... బిత్తరపోయిన లీడర్స్
కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏ విషయం తేల్చకపోవడంతో జుబేదా ఆవేదన చెందింది. నా ఆత్మహత్యకు మా పార్టీ నాయకుడు సూరయ్య బాను కారణం అంటూ ఆయన పేరు వాట్సాప్ స్టేటస్ లో పోస్టు చేసిన లేడీ లీడర్ జుబేదా నిద్రమాత్రలు మింగేసి ఆత్మహత్యాయత్నం చెయ్యడం కలకలం రేపింది. జుబేదాకు ఎన్ఆర్ పురలో ప్రథమ చికిత్స చేయించి తరువాత శివమొగ్గలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. జుబేదా దెబ్బతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కంగుతిన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications