పబ్ లో ఏం జరిగింది ?, స్పృహలోకి వచ్చేసరికి వేరే ఇంట్లో, రేప్ జరిగిందని కేసు పెట్టిన లేడీ టెక్కి !
ఐటీ హబ్ బెంగళూరు నగరంలో ఉద్యోగాలు చేస్తున్న కొందరు యువతి, యువకులు విలాస జీవితానికి అలువాటు పడుతున్నారు. బెంగళూరులోని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో టెక్కీగా ఉద్యోగం చేస్తున్న యువతి తాను స్పృహలో లేని సమయంలో తనను ఇంట్లో నిర్బంధించి తన మీద అత్యాచారం చేసి ఉంటారని, లైంగిక దాడి జరిగి ఉంటుందని, కేసు దర్యాప్తు చెయ్యాలని పోలీసులకు మనవి చెయ్యడం కలకలం రేపింది.
కార్పోరేట్ కపెనీలు, ఐటీ కంపెనీలు, ఎంఎన్ సీ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న కొందరు ఫ్రెండ్స్ తో బ్యాచులర్స్ గా అద్దె ఇండ్లు తీసుకుని నివాసం ఉంటున్నారు. కొందరు పీజీల్లో నివాసం ఉంటున్న యువతి, యువకులు అర్దరాత్రి వరకు పార్టీలు, పబ్ లు, బార్ అండ్ రెస్టారెంట్ల చుట్టూ తిరుగుతున్నారు. బ్యాచిలర్ జీవితం గడుపుతున్న కొందరు యువతి, యువకులు బెంగళూరులో విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

డిసెంబరు 12వ తేదీ రాత్రి కోరమంగళ పబ్‌కు వెళ్లిన యువతి తరువాత అక్కడే చాలాసేపు ఉండిపోయింది. అయితే ఆ లేడీ టెక్కీ ఇంటికి వెళ్లలేదు. తాను పబ్ లో ఉన్నాను అనే విషయం కూడా ఆ యువతికి తెలియలేదు. యువతి స్పృహలోకి వచ్చేసరికి కోరమంగల సమీపంలోని ఆడుగోడిలోని దేవేగౌడ లేఅవుట్ సమీపంలోని ఓ ఇంటిలో ఉంది. ఆమె స్పృహలోకి వచ్చిన తరువాత ఆ లేడీ లెక్కీ ఆ ఇంటి తలుపు గట్టిగా బాదేసింది.

లేడీ టెక్కీ తలుపులు బాదుతున్న విషయం గుర్తించిన స్థానికులు వెంటనే 112కు ఫోన్ చేశారు. అనంతరం అడుగోడి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడున్న యువతిని పోలీసులు రక్షించారు. అక్కడి నుంచి పోలీసులు యువతిని కోరమంగళ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. నేను ఆడుగోడిలోని ఇంటికి ఎలా వచ్చానో నాకే తెలియడం లేదని ఆ యువతి పోలీసులకు చెప్పింది. అపస్మారక స్థితిలో ఉన్న నాపై అత్యాచారానికి పాల్పడి ఉంటారనే అనుమానం కలుగుతోందని ఆ యువతి కోరమంగళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
అందువల్ల ఈ విషయంపై విచారణ జరిపించాలని యువతి ఫిర్యాదు చేసింది.
లేడీ టెక్కీ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న కోరమంగళ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు పబ్ లో, ఆడుగోడిలోని యువతి ఉన్న ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. మొత్తం మీద స్పృహలో లేని లేడీ టెక్కీ మీద అత్యాచారం జరిగి ఉంటుందని ఆమెకే అనుమానం రావడంతో కేసు నమోదు కావడం బెంగళూరులో కలకలం రేపింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications