Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lady techie: హ్యాండ్ ఇచ్చిన లవర్, ప్రియుడి ఇంటి ముందే లేడీ టెక్కీ ఆత్మహత్య, ఆంటీ, అంకుల్ కు !

చెన్నై/ బెంగళూరు: సమీప బంధువులైన యువతి, యువకుడు ప్రేమించుకున్నారు .ఇద్దరూ మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. 13 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్న యువతి, యువకుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న ప్రియురాలు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ తో ఇంట్లో ఉంటున్నది. ప్రియుడు వేరే రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమించుకున్న యువతి, యువకుడి మద్య ఇటీవల తేడా వచ్చిందని తెలిసింది. ఇదే మంచి టైమ్ అని ఎదురు చూసిన అబ్బాయి కుటుంబ సభ్యులు వేరే అమ్మాయితో కొడుకు పెళ్లి చెయ్యాలని నిర్ణయించాడు. సంవత్సరం నుంచి ప్రియురాలికి దూరంగా ఉంటున్న ప్రియుడు కూడా ఇంట్లో తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని వివాహం చేసుకోవడానికి సిద్దం అయ్యాడు. ఇంటి నుంచి ఉద్యోగం చేస్తున్న ప్రియురాలు నేరుగా ప్రియుడి ఇంటి దగ్గరకు వెళ్లి తనకు న్యాయం చెయ్యాలని ప్రియుడి తల్లిదండ్రులకు చెప్పింది. మా ఇంటి ముందు ప్రియురాలు నాటకాలు ఆడటానికి వచ్చిందని నిర్లక్షం చేసిన ప్రియుడి కుటుంబ సభ్యులు నిర్లక్షంగా ప్రవర్తించారు. ప్రియుడి ఇంటి ముందు ఆవేదనతో రగిలిపోయిన ప్రియురాలు అక్కడే విషం తాగేసింది. 45 నిమిషాల పాటు ప్రియుడి ఇంటి ముందు గిలగిలాడుతూ కొట్టుకుంటూ మృత్యువుతో పోరాడిన యువతి ప్రాణాలు వదిలేయడం కలకలం రేపింది. అమ్మాయి ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని చెప్పినా నిర్లక్షంగా ఇంటి తలుపులు మూసేసి కిటికీలో నుంచి సినిమా చూసిన ప్రియుడి తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు.

 సమీప బంధువులు

సమీప బంధువులు

తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోని అదియమన్ కోటై సమీపంలోని గోల్లపల్లికి చెందిన జ్ఞానమొళిని (29) అనే యువతి నివాసం ఉంటున్నది. ధర్మపురిలోని కొత్తూరు ప్రాంతానికి చెందిన మురళీధరన్ (33) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఒడిశాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో మురళీధరన్ మంచి ఉద్యోగం చేస్తున్నాడు.

బెంగళూరులో లేడీ టెక్కీ

బెంగళూరులో లేడీ టెక్కీ

బీటెక్ పూర్తి చేసిన జ్ఞానమొళిని ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నది. మురళీధరన్, జ్ఞానమొళిని సమీప బంధువులు. చిన్నప్పటి నుంచి మురళీధరన్, జ్ఞానమొళికి పరిచయం ఉంది. చాలా సంవత్సరాల నుంచి ఇద్దరూ శుభకార్యాలలో కలుసుకుంటున్నారు.

13 సంవత్సరాలు ప్రేమికులు

13 సంవత్సరాలు ప్రేమికులు

సమీప బంధువులైన మురళీధరన్, జ్ఞానమొళిని ప్రేమించుకున్నారు. మురళీధరన్, జ్ఞానమొళిని ఇద్దరూ మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. 13 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్న మురళీధరన్, జ్ఞానమొళిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న ప్రియురాలు జ్ఞానమొళిని కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ తో తమిళనాడులోని ఆమె ఇంట్లో ఉంటున్నది.

చిన్నా తేడాతో దూరం అయ్యారు

చిన్నా తేడాతో దూరం అయ్యారు

గతంలో బెంగళూరులో అపార్ట్ మెంట్ లో ఉంటున్న ప్రియురాలు జ్ఞానమొళినితో ఆమె ప్రియుడు మురళీధరన్ చాలా కాలం అక్కడే ఎంజాయ్ చేశాడు. మురళీధరన్ ఓడిశా రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమించుకున్న మురళీధరన్, జ్ఞానమొళినిమద్య గత ఏడాదిలో తేడా వచ్చింది. ఇదే మంచి టైమ్ అని ఎదురు చూసిన మురళీధరన్ కుటుంబ సభ్యులు వేరే అమ్మాయితో కొడుకు పెళ్లి చెయ్యాలని నిర్ణయించాడు.

ప్రియురాలికి తెలిసిపోయింది

ప్రియురాలికి తెలిసిపోయింది

సంవత్సరం నుంచి ప్రియురాలు జ్ఞానమొళినికి దూరంగా ఉంటున్న ఆమె ప్రియుడు మురళీధరన్ కూడా ఇంట్లో తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని వివాహం చేసుకోవడానికి సిద్దం అయ్యాడు. ఇంటి నుంచి ఉద్యోగం చేస్తున్న ప్రియురాలు జ్ఞానమొళినికి మురళీధరన్ కు పెళ్లి చేస్తున్నారని తెలిసిపోయింది. ఇలాంటి విషయాలు ఫోన్ లో మాట్లాడకూడదని, నేరుగా మాట్లాడి తేల్చుకోవాలని డిసైడ్ అయిన జ్ఞానమొళిని నేరుగా ప్రియుడి ఇంటి దగ్గరకు వెళ్లిపో తనకు న్యాయం చెయ్యాలని మురళీధరన్ తల్లిదండ్రులకు చెప్పింది.

మాకు సంబంధం లేదు.... నువ్వే మాట్లాడుకో

మాకు సంబంధం లేదు.... నువ్వే మాట్లాడుకో

నేను మురళీధరన్ ప్రేమించుకున్న విషయం మీకు తెలుసు, ఇప్పుడు వేరే అమ్మాయితో అతనికి ఎందుకు పెళ్లి చేస్తున్నారని జ్ఞానమొళి ఆమె ప్రియుడి తల్లిదండ్రులు తంగవేలు, రాధాను ప్రశ్నించింది. మాకు సంబంధం లేదు, నువ్వు మా కొడుకుతో మాట్లాడుకో అని తంగవేలు, రాధా నేరుగా ఇంట్లోకి వెళ్లిపోయి తలుపులు మూసేశారు.

ప్రియుడి ఇంటి ముందే విషం తాగేసింది

ప్రియుడి ఇంటి ముందే విషం తాగేసింది


ఇంటి ముందు నిలబడిన ప్రియురాలు కొంతసేపు న్యాయం చెయ్యాలని మనవి చేసింది. మా ఇంటి ముందు జ్ఞానమొళి నాటకాలు ఆడటానికి వచ్చిందని ప్రియుడి కుటుంబ సభ్యులు తంగవేలు, రాధా నిర్లక్షంగా ప్రవర్తించారు. ప్రియుడి ఇంటి ముందు ఆవేదనతో రగిలిపోయిన ప్రియురాలు జ్ఞానమొళి అక్కడే విషం తాగేసింది.

ప్రియురాలి ప్రాణం పోయింది

ప్రియురాలి ప్రాణం పోయింది

జ్ఞానమొళి శరీరంలోకి విషం వెంటనే చేరుకోవడంతో ఆమె భాద తట్టుకోలేక ఇంటి ముందు కిందపడిపోయింది. 45 నిమిషాల పాటు ప్రియుడి ఇంటి ముందు గిలగిలాడుతూ కొట్టుకుంటూ మృత్యువుతో పోరాడిన జ్ఞానమొళి ప్రాణాలు వదిలేయడం కలకలం రేపింది. అమ్మాయి ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని చెప్పినా నిర్లక్షంగా ఇంటి తలుపులు మూసేసి కిటికీలో నుంచి సినిమా చూసిన ప్రియుడి తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రియురాలు ఆత్మహత్య చేసుకుందని, తన తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారని తెలుసుకున్న మురళీధరన్ ఇప్పుడు అన్ని పరిస్థితులు తారుమారు కావడంతో హడలిపోతున్నాడని సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+