Lady techie: భార్యను స్పాట్ లో చంపేసిన బ్యాంక్ మేనేజర్, లవ్ మ్యారేజ్, మరో టెక్కీతో భార్యకు !

చెన్నై/ఒడిశా: బాగా చదువుకున్న యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ఇద్దరి మతాలు వేరుకావడంతో ప్రేమికులు పెళ్లి చేసుకోవడానికి రెండువైపుల కుటుంబ సభ్యులు తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. ప్రియురాలు మతం మార్చుకుని ప్రియుడిని పెళ్లి చేసుకుంది. బాగా చదువుతున్న దంపతులు చెన్నై చేరుకున్నారు. భర్త ప్రైవేట్ బ్యాంక్ లో మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. భార్య ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నది. దంపతులు ఇంటిలో ఉన్న సమయంలో గొడవ పడ్డారు. దంపతులు గొడవపడుతున్న విషయం స్థానికులకు వినిపించడంతో వెళ్లి తలుపులు కొట్టారు. చేతిలో కత్తితో శరీరం అంతా రక్తపు మరకలతో బయటకు వచ్చిన బ్యాంక్ మేనేజర్ నా భార్యను చంపేశాను, మీరు పోలీసులను పిలవండి అంటూ గట్టిగా కేకలు వెయ్యడంతో స్థానికులు హడలిపోయారు.

హిందూ అమ్మాయి, ముస్లీం అబ్బాయి

హిందూ అమ్మాయి, ముస్లీం అబ్బాయి

ఒడిశాకు చెందిన ప్రియాంక (38), ఆసీఫ్ (43)కు 12 సంవత్సరాల క్రితం పరిచయం అయ్యింది. బాగా చదువుకున్న ప్రియాంక, ఆసీఫ్ 10 సంవత్సరాల క్రితం ప్రేమించుకున్నారు. ఇద్దరి మతాలు వేరుకావడంతో ప్రేమికులు పెళ్లి చేసుకోవడానికి ప్రియాంక, ఆసీఫ్ కుటుంబ సభ్యులు తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. కొంతకాలం రెండు కుటుంబాల మద్య గొడవ జరిగింది.

 మతం మార్చుకున్న ప్రియాంక

మతం మార్చుకున్న ప్రియాంక

కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తున్న సమయంలోనే ప్రియురాలు ప్రియాంక మతం మార్చుకుని ఆమె ప్రియుడు ఆసీఫ్ ను పెళ్లి చేసుకుంది. ఐదు సంవవత్సరాల క్రితం ఆసీఫ్, ప్రియాంక దంపతులు చెన్నై చేరుకుని ముత్యాలపేట్ ప్రాంతంలో అద్దె ఇంటిని తీసుకుని కాపురం ఉంటున్నారు.

భార్య టెక్కీ, భర్త బ్యాంక్ మేనేజర్

భార్య టెక్కీ, భర్త బ్యాంక్ మేనేజర్


చెన్నైలోని మైలాపూర్ ఆర్కే రోడ్డులోని ఓ ప్రైవేట్ బ్యాంకులో ఆసీఫ్ బ్యాంక్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. చెన్నైలోని బోరూరులోని ప్రముఖ కంపెనీలో ప్రియాంక సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నది. ప్రియాంక, ఆసీఫ్ దంపతులు చాలా సంతోషంగా జీవిస్తున్నారు. ఇంటి దగ్గర ప్రియాంక, ఆసీఫ్ చాలా సంతోషంగా ఉండేవారని సమాచారం.

 భార్యను చంపేసి బయటకు వచ్చిన బ్యాంక్ మేనేజర్

భార్యను చంపేసి బయటకు వచ్చిన బ్యాంక్ మేనేజర్

ఆసీఫ్, ప్రియాంక దంపతులు బుధవారం ఇంటిలో ఉన్న సమయంలో గొడవ పడ్డారు. ప్రియాంక, ఆసీఫ్ దంపతులు గొడవపడుతున్న విషయం స్థానికులకు వినిపించడంతో వెళ్లి తలుపులు కొట్టారు. చేతిలో కత్తితో శరీరం అంతా రక్తపు మరకలతో బయటకు వచ్చిన బ్యాంక్ మేనేజర్ ఆసీఫ్ నా భార్య ప్రియాంకను చంపేశాను, మీరు పోలీసులను పిలవండి అంటూ గట్టిగా కేకలు వెయ్యడంతో స్థానికులు హడలిపోయారు.

నా భార్యకు మరో టెక్కీతో అక్రమ సంబంధం ఉంది

నా భార్యకు మరో టెక్కీతో అక్రమ సంబంధం ఉంది


పోలీసులు వెళ్లి ఆసీఫ్ ను అదుపులోకి తీసుకుని ప్రియాంకను ఎందుకు హత్య చేశావు అని విచారించారు. సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్న తన భార్య ప్రియాంక అదే కంపెనీలో పని చేస్తున్న వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని, అతనితో స్నేహం చెయ్యకూడదని చాలాసార్లు చెప్పినా నా భార్య వినలేదని, అందుకే చంపేశానని ఆసీఫ్ చెప్పాడని పోలీసులు అంటున్నారు.

లవ్ మ్యారేజ్ చేసుకున్న లేడీ టెక్కీకి చివరికి ?

లవ్ మ్యారేజ్ చేసుకున్న లేడీ టెక్కీకి చివరికి ?


దంపతుల మద్య గొడవకు పిల్లలు పుట్టకపోవడం ఓ కారణం అయ్యిందని పోలీసులు అంటున్నారు. మొత్తం మీద ప్రేమించి మతం మార్చుకుని పెళ్లి చేసుకున్న సాఫ్ట్ వేర్ ఇంజనీరు ప్రియాంక ఆమె భర్త ఆసీఫ్ చేతిలోనే హత్యకు గురికావడం చెన్నైలో కలకలం రేపింది. ప్రియాంక కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి ఆసీఫ్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని చెన్నై పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+