Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

student: అర్దరాత్రి ప్రియురాలి కోసం అపార్ట్ మెంట్ లోకి వెళ్లాడు. ఆంటీ ఎంట్రీతో ఏం చెయ్యాలో తెలీకా ?

అర్దరాత్రి ప్రియురాలు అపార్ట్ మెంట్ లో ప్రేమికులు ఏకాంతంగా ఉన్న సమయంలో ప్రియురాలి తల్లి కూతుర్ని వెతుక్కుంటూ టుర్రాస్ మీదకు వెళ్లింది. ప్రియురాలి తల్లికి చిక్కిపోతాననే భయంతో ప్రియుడు నాలుగు అంతస్తుల మీద నుంచి ప్రియుడు

చెన్నై/ సేలం: లా కాలేజ్ లో చదువుకుంటున్న అబ్బాయిలు ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. కొందరు కాలేజ్ హాస్టల్ లో నివాసం ఉంటున్నారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న యువకులు ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లి వస్తున్నారు. వేరే కాలేజ్ లో చదువుతున్న అమ్మాయి, లా కాలేజ్ అబ్బాయి ప్రేమించుకున్నారు. అర్దరాత్రి ప్రియురాలికి ప్రియుడు ఫోన్ చేశాడు. ఎవ్వరికంట కనపడకుండా మా ఇంటికి రావాలని ప్రియురాలు చెప్పింది. అర్దరాత్రి ప్రియురాలు నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లోకి ప్రియుడు వెళ్లాడు. ప్రియురాలు ఫ్లాట్ లోని ఆమె రూమ్ లో నుంచి బయటకు వచ్చింది. ప్రేమికులు ఏకాంతంగా ఉన్న సమయంలో ప్రియురాలి తల్లి కూతుర్ని వెతుక్కుంటూ టుర్రాస్ మీదకు వెళ్లింది. ఆ సందర్బంలో ప్రియురాలి తల్లికి చిక్కిపోతాననే భయంతో ప్రియుడు నాలుగు అంతస్తుల మీద నుంచి దూకడంతో అతని ప్రాణాలు గాలిలో కలిసిపోవడం కలకలం రేపింది.

లా కాలేజ్ అబ్బాయి

లా కాలేజ్ అబ్బాయి

తమిళనాడులోని సేలం జిల్లాలోని కన్నంగురి సమీపంలోని చిన్నక్ క్లినిలి ప్రాంతంలో ఒక ప్రైవేట్ న్యాయ కళాశాల (లా కాలేజ్) ఉంది. ఈ లా కాలేజ్ లో తమిళనాడులోని వివిధ జిల్లాల నుంచి వెళ్లిన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ప్రైవేట్ లా కళాశాల సమీపంలోని ఇళ్లు, అపార్ట్ మెంట్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటూ కళాశాలకు వెళుతున్నారు. ఈ కళాశాలలో ధర్మపురిజిల్లాలోని వెన్నంపట్టి సమీపంలోని కామరాజర్ నగర్‌కు చెందిన సంజయ్ అలియాస్ సంజు (18) అనే యువకుడు లా మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

అపార్ట్ మెంట్ లో...... కాలేజ్ లో అమ్మాయి

అపార్ట్ మెంట్ లో...... కాలేజ్ లో అమ్మాయి

సంజయ్ తల్లిదండ్రులు ధర్మపురిలో బ్యాంకుల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. సంజయ్ తో పాటు కొందరు విద్యార్థులు ప్రైవేట్ లా కళాశాల సమీపంలోని ఓ ఇంటి డాబా మీద ఉన్న ఇంట్లో అద్దెకు ఉంటూ కళాశాలకు వెళ్తున్నారు. సంజయ్‌తో పాటు కరూర్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల అమ్మాయి కూడా అదే కాలేజ్ లో చదువుతోంది. ఆ అమ్మాయి ఆమె తల్లిదండ్రులతో కలిసి లా కాలేజ్ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నది.

ప్రేమలో పడిన యువతి, యువకుడు

ప్రేమలో పడిన యువతి, యువకుడు

సంజయ్, కాలేజ్ అమ్మాయి ప్రేమించుకుంటున్నారని వారి స్నేహితులు అంటున్నారు. రాత్రి ఒంటిగంట సమయంలో సంజయ్ తాను బయటకు వెళ్తున్నానని అతని స్నేహితులకు చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. తరువాత సంజయ్ అతని ప్రియురాలికి ఫోన్ చేశాడు. ఎవ్వరికంట కనపడకుండా మా ఇంటికి రావాలని ప్రియురాలు సంజయ్ కి చెప్పిందని తెలిసింది. అర్దరాత్రి ప్రియురాలు నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లోకి సంజయ్ వెళ్లాడు.

ఇంటి టెర్రాస్ మీదకు వచ్చేయ్

ఇంటి టెర్రాస్ మీదకు వచ్చేయ్

మళ్లీ ఫోన్ చేసిన ప్రియురాలు టెర్రాస్ మీదకు రమ్మని చెప్పడంతో సంజయ్ అక్కడికి వెళ్లాడు. ప్రియుడు సంజయ్ దగ్గరకు వెళ్లిన ప్రియురాలు అతనితో మాట్లాడుతోంది. ఆ సమయంలో ప్రియురాలి తల్లి కూతుర్ని వెతుక్కుంటూ మేడ మీదకు వచ్చింది. తన ప్రియురాలి తల్లిని చూసి షాక్ అయిన సంజయ చిక్కిపోతామనే భయంతో అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే చీకట్లో మెట్లు ఎక్కడున్నాయో, ఎలా దిగాలో తెలీకపోవడంతో సుమారు 50 అడుగుల ఎత్తులోని నాలుగో అంతస్తు మీద నుంచి కిందకూ దూకేశాడు.

స్పాట్ లో చనిపోయిన ప్రియుడు

స్పాట్ లో చనిపోయిన ప్రియుడు

నాలుగో అంతస్తు నుంచి కిందపడిన సంజయ్‌ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అస్తంపట్టి లక్ష్మీప్రియ, పోలీస్ ఇన్‌స్పెక్టర్ సెల్వరాజ్ సంఘటనా స్థలానికి చేరుకుని లా కాలేజ్ విద్యార్థి సంజయ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కుమారమంగళం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

పోలీసుల అదుపులో తల్లీ కూతురు

పోలీసుల అదుపులో తల్లీ కూతురు

లా కాలేజ్ అబ్బాయి సంజయ్ తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై కన్నంకురిచ్చి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లా కాలేజ్ విద్యార్థి సంజయ్ మృతి చెందడంతో అతని ప్రియురాలు, ఆమె తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఓ ప్రైవేట్ లా కాలేజీ విద్యార్థి సంజయ్ ప్రియురాలి కోసం వెళ్లి నాలుగో అంతస్తు నుంచి కిందపడి మృతి చెందడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+