వామ్మో.. ఇంట్లోకి చొరబడ్డ చిరుత.. కనిపించిన శునకాన్ని నోట్లో పెట్టుకొని...(వీడియో)

బెంగళూరు : మీ ఇల్లు జనావాసాలకు దూరంగా ఉందా ? చుట్టు కొండలు, కొనలు ఉన్నాయా ? సమీపంలో దట్టమైన అడవీ ఉందా ? అయితే తస్మాత్ జాగ్రత్త. మీరు ఇల్లైనా మారండి .. లేదంటే ఊరి విడిచి వెళ్లండి. అవును కర్ణాటకలో జరిగిన ఘటన ఉలిక్కిపడేలా చేస్తోంది. ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు గానీ .. ఓ చిరుత ఇంటి వద్దకొచ్చింది. రాజసం ఒలకబోస్తూ వచ్చి .. అక్కడే ఉన్న పెంపుడు కుక్కను అందుకొని వెళ్లింది. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డవడంతో ఇంటి యాజమానులు గజగజ వణికిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరలవుతుంది.

 ఒళ్లు గగుర్పొడిచే ఘటన ..

ఒళ్లు గగుర్పొడిచే ఘటన ..

శిమొగ్గ జిల్లా తిర్తహల్లిలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన జరిగింది. ఇంటి ఎదుట ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలో రికార్డైన వీడియో చూసి ఆందోలన చెందారు. ఈ నెల 14న ఇంటి వద్దకు ఓ చిరుతపులి వచ్చింది. అటు ఇటు చూసింది. దానికి పెంపుడు కుక్క కనిపించింది. వెంటనే గోడదూకి .. కుక్కను ఆమాంతం పట్టేసుకుంది. తర్వాత కుక్కను తీసుకొని వెళ్లిపోయింది. తర్వాత శునకం ఆచూకీ తెలియకపోవడంతో ... ఇంటి యాజమాని సీసీటీవీ ఫుటేజీ చూస్తూ దిమ్మతిరిగి మైండ్ బ్లాంకయ్యింది. ఆ వీడియో చూసి అతని భార్య మూర్చపోయారు.

నెటిజన్ల సెటైర్లు ..

నెటిజన్ల సెటైర్లు ..

ఈ వీడియోను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో తెగ వైరలవుతుంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. 'పొరపాటున మనుషులే చిరుతపులి ఇంటికెళ్లారు. ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది అనంటున్నారు. మరొకరు బలహీన శునకం .. చిరుతపులి ఆహారానికి బలైయిందని ట్వీట్ చేశారు. ఇది ప్రకృతి తప్పిదం .. కానీ విషాదకరం అని ‘ మరొకరు ట్వీట్ చేశారు. కర్ణాటకలో చిరుతపులి సంచారం ఇదే తొలిసారి కాదు. గత జనవరిలో కూడా హులియుర్‌దుర్గలో కూడా ఓ గదిలో దూరి శునకాన్ని తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.

గజ గజ ..

ఏదీ ఏమైనా చిరుతపులి సంచారంతో తిర్తహల్లి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తమ గ్రామంలో చిరుతపులి వచ్చిందని తెలిసి వణుకుతున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. లేదంటే తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని వాపోతున్నారు. గ్రామంలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదని గుర్తుచేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+