LIC Jeevan Dhara 2: రూ.1 లక్ష పెట్టుబడితో కోట్ల రూపాయాలు..!
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఇటీవల ఓ పాలసీని తీసుకొచ్చింది. అదే ఎల్ఐసీ జీవన్ ధార II పాలసీ. ఇది ఒక యాన్యుటీ ప్లాన్. ఈ నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ పాలసీ. హామీతో కూడిన ఆర్థిక భవిష్యత్తును భరోసా ఇస్తుంది. ఇందులో సింగిల్ లైఫ్ యాన్యుటీ, జాయింట్ లైఫ్ యాన్యటీ అవకాశం ఉంది. అంటే భర్యభర్తల్లో ఎవరైన ఒకరు తీసకోవచ్చు లేదా ఇద్దరు తీసుకోవచ్చు.
ఈ పాలసీ తీసుకోవడానికి కనీస వయస్సు 20 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయస్సు 80, 70, 65 సంవత్సరాలుగా ఉంది. గరిష్ట వయస్సు యాన్యుటీ ఎంపికపై ఆధారపడి ఉంటుంది. యాన్యుటీ రేట్లు పెరుగుతున్న వయస్సుతో పెరుగుతాయి. ఇందులో రెగ్యులర్ ప్రీమియం లేదా సింగిల్ ప్రీమియం వెసులుబాటు ఉంటుంది. సాధారణ ప్రీమియమ్‌లకు 5 నుంచి 15 సంవత్సరాల వరకు, సింగిల్ ప్రీమియంలకు 1 నుంచి 15 సంవత్సరాల వరకు వాయిదా వ్యవధిని నిర్ణయించుచుకోవచ్చు.

ఉదాహరణకు 20 సంవత్సరాల వ్యక్తి ఈ పాలసీ తీసుకుంటే అతనికి 35 సంవత్సరాల నుంచి యాన్యుటి వస్తుంది. పాలసీదారులు వార్షిక, అర్ధ-వార్షిక, త్రైమాసిక, నెలవారీ చెల్లింపుల విధానాన్ని ఎంచుకోవచ్చు. సింగిల్ లైఫ్ యాన్యుటీ కేటగిరీలో పాలసీదారులు ఒకే లైఫ్ యాన్యుటీని అందించే ఆప్షన్ 1 లేదా ఆప్షన్ 2తో సహా విభిన్న ప్లాన్‌లను ఎంచుకోవచ్చు.
జాయింట్ లైఫ్ యాన్యుటీ ఎంపికలు ఆప్షన్ 8, ఆప్షన్ 9 లో ఉన్నాయి. ఈ పాలసీలో లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీ ఉండదు. ఈ పాలసీ తీసుకున్నవారు చనిపోతే నామనీకి మిగిలిన డబ్బులు వస్తాయి. ఈ పాలసీని ఆఫ్‌లైన్ ఛానెల్‌లు, ఏజెంట్లు లేదా మధ్యవర్తుల ద్వారా లేదా నేరుగా ఆన్‌లైన్‌లో అధికారిక ఎల్ఐసీ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. పూర్తి వివరాలకు ఎల్ఐసీ వెబ్ సైట్ సందర్శించండి.












Click it and Unblock the Notifications