మధ్యప్రదేశ్ లోనూ తెలంగాణా పరిస్ధితే ? చిన్న పార్టీలపై కాంగ్రెస్, బీజేపీ కన్ను..!

వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న మధ్యప్రదేశ్ తో పాటు తెలంగాణలో దాదాపు హోరాహోరీ పోరు తప్పదని తేలిపోతోంది. మధ్యప్రదేశ్ తో పాటు తెలంగాణలోనూ మరోసారి అధికారం కోసం ప్రయత్నిస్తున్న జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ కు ఇప్పుడు చిన్న పార్టీలతో పని పడింది. ఇన్నాళ్లూ తమదే గెలుపు అన్నట్లుగా ఉన్న ఈ రెండు పార్టీలు ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ మారుతున్న పరిస్ధితుల్ని అంచనావేసుకుంటూ వ్యూహాల్లో మార్పులు చేసుకుంటున్నాయి.

ఈసారి మధ్యప్రదేశ్ లో అధికార బీజేపీ కంటే విపక్ష కాంగ్రెస్ అధికార రేసులో ముందంజలో ఉందని పలు సర్వేలు ప్రకటించాయి. 2018లో జరిగిన గత ఎన్నికల్లో కనీసం 30 స్థానాల్లో 3,000 కంటే తక్కువ ఓట్ల తేడాతో అభ్యర్ధుల విజయాలు నమోదయ్యాయి. వీటిలో కాంగ్రెస్ 15, బీజేపీ 14, బీఎస్పీ 1 సీట్లు ఇలా తక్కువ మెజార్టీతో గెలిచాయి. అలాగే ఈసారి కూడా బీజేపీ, కాంగ్రెస్ మధ్య సాగే హోరాహోరీ పోరులో చాలా చోట్ల ఫలితాలు తక్కువ మెజార్టీతో నమోదయ్యేలా ఉన్నాయి.

like telangana, congress and bjp eye on small parties in madhya pradesh amid tight fight

దీంతో ఈ ఎన్నికలలో చిన్న పార్టీల పాత్ర కీలకం కానుందని తేలిపోయింది. దీంతో ప్రాంతీయ పార్టీ అయిన గోండ్వానా గంతంత్ర పార్టీ (జిజిపి)తో పొత్తు పెట్టుకున్న బీఎస్పీ, మధ్యప్రదేశ్‌లో 30 కంటే ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని చూస్తున్న సమాజ్‌వాదీ పార్టీ ఉన్నాయి. ఇండియా కూటమి భాగస్వామి అయిన కాంగ్రెస్‌తో పొత్తు విఫలం కావడంతో ఎస్పీ ఇక్కడ పోటీలో ఉంది.
దాదాపు 20 ఏళ్లు అధికారం అనుభవించిన బీజేపీ.. తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోంది. దీన్ని అధిగమించేందుకు కేంద్రంలో నేతల్ని రంగంలోకి దించింది.

మధ్యప్రదేశ్ లో జరిగిన 2013, 2018 ఎన్నికల ఫలితాల్ని విశ్లేషిస్తే.. ఒకే పార్టీ గెలుపొందిన 7 స్థానాల్లో 2018లో కాంగ్రెస్ 4, బీజేపీ 3 ఉన్నాయి. 2018లో స్వల్ప ఓట్ల తేడాతో గెలిచిన చాలా నియోజకవర్గాల్లో ప్రాంతీయ పార్టీల గెలుపు కంటే విజేతలకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఈసారి నవంబర్ 17న జరగనున్న ఎన్నికల్లో ఎస్పీ ఇప్పటివరకు 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వీటిలో 2018లో 3 కాంగ్రెస్‌ సిట్టింగ్ స్ధానాలున్నాయి.ఎస్‌పి నామినేట్‌ చేసిన 9 స్థానాల్లో 5 స్థానాల్లో కాంగ్రెస్‌ కూడా అభ్యర్థులను ప్రకటించింది.

2018లో ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో చిన్న పార్టీలు సాధించిన ఓట్ల కంటే మెజార్టీ తేడా తక్కువగా ఉంది. వీటిలో విజయపూర్,
గ్వాలియర్ రూరల్, గ్వాలియర్ సౌత్, బీనా (ఎస్సీ రిజర్వ్‌డ్), మైహార్, తిమర్ని, డియోటాలాబ్, రాజ్‌పూర్ (ఎస్టీ-రిజర్వ్‌డ్),
ఉన్నాయి. ఆయా ఫలితాల్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలైన ఎస్పీ, బీఎస్పీ, ఇతర పార్టీలపై కన్నేశాయి. వాటీని ఎలాగోలా మచ్చిక చేసుకుంటే ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకోవచ్చనేది వాటి ఆలోచన.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+