Lockdown: ఆర్థిక సమస్యలు, వీడు ఏం చేశాడో తెలిస్తే మీరు ఏమంటారో తెలీదు, ప్రియురాలి వీడియోలు !

చెన్నై/ కన్యాకుమారి: పెళ్లి చేసుకుంటానని 26 ఏళ్ల యువతిని ఓ యువకుడు నమ్మించాడు. ప్రేమ, పెళ్లి ముసుగులో ఇంత కాలం ఆయువతిని అన్ని విదాలుగా వాడుకున్నాడు. పెళ్లి చేసుకునే వ్యక్తి కదా అని నమ్మిన ఆ యువతి గుడ్డిగా అతనితో ఏకాంతంగా గడిపింది. ప్రియురాలితో ఏకాతంగా గడిపిన సమయంలో ప్రియుడు రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీశాడు, లాక్ డౌన్ సందర్బంగా వ్యాపారం మూతపడటం, ఆర్థిక సమస్యలు ఎదురుకావడంతో జల్సాల కోసం యువతిని డబ్బులు ఇవ్వాలని, లేదంటే ఏకాంతంగా తీసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు. డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన ప్రియురాలి పర్సనల్ వీడియోలు, ఫోటోలను ఆమె ప్రియుడు సోషల్ మీడియాలో పోస్టు చేసేశాడు.

 సీడీ షాప్ యజమాని

సీడీ షాప్ యజమాని

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా అళగియా పాండిపురానికి చెందిన మార్ఫిన్ గణేష్ (26) అనే యువకుడు సొంతంగా సీడీ షాపు నిర్వహిస్తున్నాడు. సీడీ షాపుకు వచ్చివెళ్లే వారితో మార్ఫిన్ గణేష్ పరిచయాలు పెంచుకున్నాడు. షాప్ కు వచ్చి వెళ్లేవారితో ఇతను టచ్ లోనే ఉంటున్నాడు.

 ప్రేమ ముసుగులో యువతికి వల

ప్రేమ ముసుగులో యువతికి వల

అంజు గ్రామానికి చెందిన 26 ఏళ్ల యువతి మార్ఫిన్ గణేష్ కు ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యింది. తరువాత ప్రేమ ముసుగులో మార్ఫిన్ గణేష్ ఆ యువతికి దగ్గర అయ్యాడు. అప్పటి నుంచి ఆ యువతి, మార్ఫిన్ గణేష్ నేరుగా కలుసుకోవడం మొదలుపెట్టారు. పెళ్లి చేసుకుంటానని ఆ యువతికి మాయమాటలు చెప్పిన మార్ఫిన్ గణేష్ మరింత దగ్గర అయ్యాడు.

 రహస్యంగా నగ్న వీడియోలు, ఫోటోలు

రహస్యంగా నగ్న వీడియోలు, ఫోటోలు

ప్రేమించిన యువకుడు వివాహం చేసుకుంటానని మాట ఇవ్వడంతో ఆ యువతి మార్ఫిన్ గణేష్ చెప్పినట్లు వినింది. ఇద్దరు కలిసి సన్నిహితంగా ఫోటోలు తీసుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన మార్ఫిన్ గణేష్ ఆ యువతిని శారీరకంగా అనుభవించాడు. ఏకాంతంగా గడుపుతున్న సమయంలో మార్ఫిన్ గణేష్ ప్రియురాలి నగ్న వీడియోలు, ఫోటోలు తీశాడు.

 లాక్ డౌన్ దెబ్బతో బ్లాక్ మెయిల్

లాక్ డౌన్ దెబ్బతో బ్లాక్ మెయిల్

లాక్ డౌన్ సందర్బంగా రెండు నెలలుగా సీడీ షాపు మూతపడటంతో వ్యాపారం లేక మార్ఫిన్ గణేష్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో మార్ఫిన్ గణేష్ క్రిమినల్ మైండ్ లో ఓ ఐడియా వచ్చింది. తన దగ్గర ఉన్న ప్రియురాలి నగ్న వీడియోలు అడ్డం పెట్టుకుని ఆమెను బ్లాక్ మెయిల్ చేసి తన జల్సాల కోసం డబ్బులు లాక్కోవాలని ప్లాన్ వేశాడు. తనకు డబ్బులు ఇవ్వకపోతే నీ నగ్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని ప్రియురాలిని బెదిరించిన మార్ఫిన్ గణేష్ ఆమె దగ్గర నెల రోజుల పాటు సుమారు రూ. లక్షకు పైగా డబ్బులు వసూలు చేసి జల్సాలు చేశాడు.

 సోషల్ మీడియాలో ప్రియురాలి పరువు తీశాడు

సోషల్ మీడియాలో ప్రియురాలి పరువు తీశాడు

నిత్యం ప్రియురాలిని మార్ఫిన్ గణేష్ పీడించడం మొదలుపెట్టాడు. తన దగ్గర దాచుకున్న డబ్బులు అంతా అయిపోయిందని ఇక డబ్బులు ఇవ్వడం తనకు సాధ్యం కాదని ప్రియురాలు తేల్చి చెప్పింది. అయితే మార్ఫిన్ గణేష్ టార్చర్ రోజురోజుకు పెరిగిపోవడంతో ఆ యువతి ఆమె తల్లికి జరిగిన విషయం మొత్తం చెప్పింది. యువతి తల్లి మర్యాదగా ఉండాలని మార్ఫిన్ గణేష్ కు వార్నింగ్ ఇచ్చింది. ప్రియురాలు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో మార్ఫిన్ గణేష్ ఆమెను ఏకాంతంగా కలుసుకున్న సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు సోస్ మీడియాలో పోస్టు చేసి ఆమె పరువు తీసేశాడు.

Recommended Video

    Covid 19 : No School Till COVID-19 Case Zero Or Vaccine Invented - Parents
     ప్రియుడి తోలు తీసిన పోలీసులు

    ప్రియుడి తోలు తీసిన పోలీసులు

    తన కుమార్తె ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేశారనే విషయం తెలుసుకున్న యువతి తల్లి అంజు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు మార్ఫిన్ గణేష్ ను అరెస్టు చేసి అతని తోలు తీశారు. సోషల్ మీడియాలో పోస్టు చేసిన యువతి ఫోటోలు, వీడియోలు డిలీట్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+