Lockdown చాన్స్: 21 ఏళ్ల అమ్మాయిని ఎత్తుకెళ్లిన మైనర్ బాలుడు, సినిమా స్టైల్లో అన్ని ప్రయత్నాలు చేసి

చెన్నై: ఉద్యోగం ముగించుకుని ఇంటికి నడిచి వెలుతున్న 21 ఏళ్ల యువతిని ఓ మైనర్ బాలుడు ఎత్తుకెళ్లాడు. రైల్వేస్టేషన్ సమీపంలోకి యువతిని ఎత్తుకెళ్లిన కామాంధుడు ఆమె నోట్లో గుడ్డలు కుక్కేశాడు. పాత సినిమాల్లో విలన్లు హీరోయిన్, మహిళలపై ఏ విధంగా అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నిస్తారో అచ్చం అలాగే యువతి మీద మైనర్ బాలుడు అత్యాచారం చెయ్యడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా షాక్ కు గురైనారు.

 ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి

ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి

చెన్నై సిటీలో రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో మూడు రోజుల నుంచి ఆ నగరంలో లాక్ డౌన్ అమలు చేశారు. అనవసరంగా ప్రజలు రోడ్ల మీద సంచరించరాదని, వాహనాల్లో రోడ్ల మీదకు రాకూడదని చెన్నై సిటీ పోలీసులు కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ దెబ్బతో చెన్నై సిటీ 95 శాతం బోసిపోయింది.

రాత్రి పొద్దుపోయిన తరువాత !

రాత్రి పొద్దుపోయిన తరువాత !

ఎప్పటిలాగే రాత్రి పొద్దుపోయిన తరువాత ఉద్యోగం ముగించుకున్న యువతి నడుచుకుంటూ ఇంటికి బయలుదేరింది. లాక్ డౌన్ సందర్బంగా ఆటోలు లేకపోవడంతో ఆమె నడిచి ఇంటికి వెలుతున్నది. ఆ సమయంలో వెనుక నుంచి 17 ఏళ్ల బాలుడు ఆ యువతిని ఫ్యాలో అయ్యాడు. వెనుక నుంచి యువతిని గట్టిగా పట్టుకున్న మైనర్ బాలుడు ఆమె తప్పించుకోకుండా జాగ్రత్త పడ్డాడు.

 సినిమా స్టైల్లో స్కెచ్

సినిమా స్టైల్లో స్కెచ్

పాత సినిమాల్లో హీరోయిన్ లు, మహిళలు గట్టిగా కేకలు వెయ్యకుండా విలన్లు వారి నోట్లు ఎలా బట్టలు కుక్కుతారో అలాగే మైనర్ బాలుడు యువతి నోట్లో బట్టలు కుక్కాడు. తరువాత రోడ్డు మీద నుంచి 21 ఏళ్ల అమ్మాయిని రోడ్డు సమీపంలోని రైల్వేస్టేషన్ సమీపంలోని నిర్జనప్రదేశంలోకి ఎత్తుకెళ్లి ఆమెపై అత్యాచారం చెయ్యడానికి విఫలయత్నం చేశాడు.

తప్పించుకున్న అమ్మాయి

తప్పించుకున్న అమ్మాయి

బాలుడు అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించిన సమయంలో ఆమె దుస్తులు చిరిగిపోయాయి. అతి కష్టం మీద నోట్లో బట్టలు బయటకు లాగేసిన అమ్మాయి గట్టిగా కేకలు వేసింది. అయితే లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా జనసంచారం అంతంత మాత్రంగా ఉండటంతో ఆ అమ్మాయిని రక్షించడానికి ఎవ్వరూ రాలేదు.

Recommended Video

    #Lockdown : Street Merchants In Hyderabad Facing Problems Due To Corona Lockdown
    పోలీసులు షాక్

    పోలీసులు షాక్


    బాలుడి చెర నుంచి తప్పించుకున్న యువతి పరుగు తీసి గస్తీలో ఉన్న పోలీసులకు సమాచారం ఇచ్చింది. యువతి ఇచ్చిన సమాచారం మేరకు గాలించిన పోలీసులు ఎట్టకేలకు 17 ఏళ్ల బాలుడిని రాత్రే పట్టుకున్నారు. ఆ సమయంలో తాను చెన్నైలోనే నివాసం ఉంటున్నానని, తన పేరు ఎంజీఆర్ అని ఆ బాలుడు చెప్పడంతో పోలీసులు షాక్ కు గురైనారు. ఎంజీఆర్ అలనాటి సూపర్ స్టార్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. అంతే కాకుండా ఆ బాలుడు పీకలదాక మద్యం సేవించి ఉన్నాడని పోలీసులు అన్నారు. మద్యం సేవించి కిక్కు నిశాలానికి ఎక్కిపోవడంతో అమ్మాయి మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడని పోలీసులు చెప్పారు. నిందితుడిని బాల నేరస్తుల కోర్టు ముందు హాజరుపరిచి కేసు విచారణ చేస్తున్నామని చెన్నై సిటీ పోలీసులు తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+